మన ధ్యాస ప్రతినిధి సాలూరు నవంబర్ 25 :- విధులలో వున్న మండల వ్యవసాయ శాఖా అధికారులను అడ్డుకున్న కొఠియా అధికారులు. కొదమ పంచాయతీ పగులు చెన్నూరు గ్రామానికి రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా మండలసహయ వ్యవసాయ శాఖా అధికారి కె. ఉమ, ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి శోభ తదితరులు మంగళవారం పగులు చెన్నూరు పంచాయతీ ఎగువ మెండంగి గ్రామానికి రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి సర్వే నిర్వహించడానికి వెళ్లిన మహిళ అధికారులను ఒడిస్సా అధికారులైన అడిషనల్ ప్రాజెక్ట్ అధికారి, ఎంపీడీవో, ఎమ్మార్వో తదితర సిబ్బంది వచ్చి కుటియా వివాదాస్పద గ్రామాలలో ఆంధ్ర అధికారులు వచ్చి సర్వే నిర్వహించడానికి వీలు లేదు ఇక్కడ నుంచి తక్షణమే వెళ్ళిపోమని దురుసుగా చెప్పడంతో చేసేదిలేక వ్యవసాయ శాఖ అధికారులు వెనుతిరిగామని స్థానిక విలేకరులకు తెలియజేశారు. ఇలా ఆంధ్ర అధికారులపై చాలాసార్లు ఒడిస్సా అధికారులు దుందుడుకు చర్యలకు పాల్పడడం పరిపాటిగా మారింది. దశాబ్దాల కాలంగా కొఠియా వివాదాస్పద గ్రామాలలో సుప్రీంకోర్టు స్టేటస్కో విధించిన సంగతి విధితమే. స్టేటస్కు విధించడం అంటే ఇటువైపు ఆంధ్ర అధికారులు, అటువైపు ఒడిస్సా అధికారులు ఆయా గ్రామాలలో సమానంగా ప్రజల సమస్యలు పరిష్కరించవచ్చు. అయినప్పటికీ ఒడిస్సా అధికారులు ఎప్పటికప్పుడు ఆంధ్ర అధికారులపై దూకుడుగా ప్రవర్తిస్తున్న ఇటు నాయకులు, జిల్లా అధికారులు నోరు మెదపడం లేదని ఆంధ్ర అధికారులు వాపోతున్నారు.