మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:
ద్విచక్ర వాహనదారులు ప్రభుత్వ నియమాలు తప్పక పాటించాలని సి ఐ సూర్య అప్పారావు తెలిపారు.
ఈ సందర్భంగా యర్రవరం పోలీస ఔట్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు.
పలు ద్విచక్ర వాహనాల సంబంధించిన రికార్డులు పరిశీలిచారు, రికార్డులు సరిగా లేని పలు వాహనదారులకు ఫైన్ విధించారు.ఈ సందర్భంగా సీ ఐ సూర్య అప్పారావు వాహనాలు దారులకు
నియమ నిబంధనలుపై అవగాహన కల్పించారు. మైనర్ లు బైక్, తదితర వాహనాలు నడప రాదని హెచ్చరించారు. అటువంటి వారిపై చట్ట పరమైన చర్యలు చేపడతామని అన్నారు.బైక్, మోపెడ్, ఏ ద్విచక్ర వాహనం అయినా హెల్మెట్ తప్పక వాడాలని అన్నారు. వాహనదారులు వాహన పత్రాలతో పాటు, లైసెన్సు, తప్పక కలిగి ఉండాలని అన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *