మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )
మద్నూర్,డోంగ్లీ మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో ఇందిరమ్మ శక్తి చీరలను డిఆర్డిఓ సురేందర్, మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిలు,డోంగ్లీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గజానంద్ దేశాయ్,మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ తో కలిసి మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డిఆర్డిఓ సురేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆడపడుచుల శ్రేయస్సు కోసం ప్రత్యేకంగా కృషి చేస్తోందని, మహిళల అభివృద్ధి కోసం వివిధ పథకాల ద్వారా సహకారం అందిస్తోందని తెలిపారు.మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తున్నాయని పేర్కొన్నారు.మహిళా శక్తి,ఐకెపి కార్యక్రమాలు గ్రామీణ ఆడపడుచుల జీవనోపాధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరెక్కువ మందికి చేరేలా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.
ఈ లోన్లను సద్వినియోగం చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు,ఉపాధి మార్గాలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మద్నూర్ తహసీల్దార్ ఎం.డి.ముజీబ్,మద్నూర్ ఎంపీడీవో రాణి,డోంగ్లీ తహసీల్దార్ శరత్,ఐకెపి ఏపీఎం జగదీష్ కుమార్,ఐకెపి సీసీలు,వివోఏ మహిళలు,ఐకెపి సిబ్బంది తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *