మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పరిధిలోని జిల్లా కాంగ్రెస్ కమిటీలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులను జారీ చేశారు.
ఈ నియామకాలలో భాగంగా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఏలే మల్లికార్జున్ నియమితులయ్యారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన వైస్ ఎంపీపీగా పనిచేసి, ప్రస్తుతం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు.డీసీసీ అధ్యక్షునిగా నియామకం కావడంతో మండలంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. టపాకాయలు కాలుస్తూ, ఒకరికి ఒకరు మిఠాయిలు పెట్టుకుని హర్షం వ్యక్తం చేశారు.జుక్కల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలను ఏకతాటిపైకి తెచ్చి ప్రోత్సహించినందుకు, డీసీసీ అధ్యక్ష పదవికి తనను ఎంపిక చేయడంలో కీలకపాత్ర పోషించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మల్లికార్జున్ కృతజ్ఞతలు తెలిపారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *