మన ధ్యాస ,నెల్లూరు, నవంబర్ 7 :నెల్లూరు నగరంలో “నేచర్ ఈవెంట్స్ ఎక్స్‌పో” ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నెల్లూరు ఆర్గానిక్ మేళా మెగా ఎక్స్‌పో ను నెల్లూరు గల మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో శనివారం ఘనంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభిస్తారని శుక్రవారం నెల్లూరు ,ఆచారి వీధిలో గల నెల్లూరు ప్రెస్ క్లబ్ లు లో విలేకరుల సమావేశంలో నిర్వాహకులు తెలియజేశారు.ఈ నెల్లూరు ఆర్గానిక్ మేళా నవంబర్ 8 నుంచి 12 వరకు, రోజూ ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండనుంది అని అన్నారు.ఈ ఎక్స్‌పో ముఖ్య నిర్వాహకులు కె.కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు వినియోగించటం వల్ల ప్రజలు అన్ని విధాల ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ మేళాలో ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రెండు రాష్ట్రాలలోని వ్యవసాయ ఉత్పత్తిదారుల ప్రదర్శన, అమ్మకాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రెండు రాష్ట్రాల ప్రజలతో పాటు నెల్లూరు జిల్లా, నగరవాసులు ఈ అవకాశాని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ,జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పి.సత్యవేణి ,జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఏపీసిఎన్ఎఫ్ ,ఆర్ వై ఎస్ ఏ రాజకుమార్ స్థానిక కార్పొరేటర్ నేతాజీ వేదవతి తదితరులు పాల్గొంటారని తెలిపారు.








