మన ధ్యాస, నెల్లూరు, మే 15 : నెల్లూరు నగరంలో నూతనంగా ప్రారంభమైన ట్రాక్టర్ ల షోరూమ్, అగస్త్య ఆగ్రోస్ ను సందర్శించి, సోలిస్, యన్మార్ ట్రాక్టర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి, వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా కాకాణి గోవర్ధన్ రెడ్డి.షోరూమ్ లో అందుబాటులో ఉన్న వివిధ మోడల్ ట్రాక్టర్ల వివరాలు కాకాణికి తెలియజేసిన నిర్వాహకులు.మాజీ మంత్రి కాకాణి చేతుల మీదగా రైతులకు ట్రాక్టర్లు అందజేత.అగస్త్య ఆగ్రోస్ షోరూం నూతన ప్రారంభోత్సవం సందర్భంగా గుండాల వంశీ కృష్ణారెడ్డి, యనమల నాగార్జున రెడ్డిలకు శుభాకాంక్షలు తెలియజేసిన కాకాణి.ఈ సందర్భంగా కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ…….వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరగడం శుభపరిణామం,రైతులకు నాణ్యమైన ట్రాక్టర్లను మరియు మెరుగైన సేవలను అందించడం ద్వారా వ్యవసాయం మరింత సులభతరం అవుతుంది అని అన్నారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయడంలో ఇటువంటి షోరూమ్‌ల పాత్ర కీలకం అన్నారు.సోలీస్ (solis) సంస్థ విడుదల చేస్తున్న ట్రాక్టర్లు ఏసీ క్యాబిన్ ల తో సిద్ధమవుతుండడం వ్యవసాయ రంగంలో ఆహ్వానించదగిన అంశం అని అన్నారు.మండుటెండలో సైతం కష్టపడి పనిచేసే అన్నదాతలకు ఏసీ క్యాబిన్ ట్రాక్టర్ లు , రానుండడం శుభ పరిణామం అని అన్నారు. షోరూమ్ నిర్వాహకులు గుండాల వంశి కృష్ణారెడ్డి, యనమల నాగార్జున రెడ్డిలకు ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనల తోపాటు, నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని అన్నారు. అగస్త్య ఆగ్రోస్ గ్రూప్ రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ మరెన్నో ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ, వ్యాపార రంగంలో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, భగవంతుని ప్రార్థిస్తున్నా అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *