- జగన్ హయాంలో 220 మంది దళితుల దారుణ హత్య, 56,981 దాడులు!
- 637 మంది దళిత మహిళలపై అత్యాచారాలు – ఎన్‌సిఆర్‌బి రిపోర్ట్‌లో ఏపీ నంబర్ వన్!
- రూ.33,000 కోట్ల సబ్‌ప్లాన్ నిధుల మళ్లింపుపై నిలదీత….
- కూటమి ప్రభుత్వం దళిత పక్షపాతి – 2026-27 బడ్జెట్లో ఎస్సీ సంక్షేమానికి రూ. 22,000 కోట్లు, రద్దయిన 18 పథకాల పునరుద్ధరణ!
మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం గోపాలపట్నం మే 20:

గత ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవినీతి, అరాచక పాలనలో రాష్ట్రంలోని దళిత సమాజం తీవ్ర అవమానాలు, అణచివేత,దౌర్జన్యాలు ఎదుర్కొంటూ నరకయాతన అనుభవించిందని ప్రభుత్వం విప్ మరియు విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.గోపాలపట్నం లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా జగన్ పాలనలో దళితులపై జరిగిన క్రూరమైన దాడులు,హత్యల వివరాలతో కూడిన అధికారిక కరపత్రాలను ఆయన విడుదల చేశారు.డాక్టర్ సుధాకర్,డ్రైవర్ సుబ్రహ్మణ్యంల ఉదంతాలు జగన్ రెడ్డి నిజస్వరూపంసమావేశంలో ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ,జగన్ మోహన్ రెడ్డి దళిత వ్యతిరేక విధానాలకు డాక్టర్ సుధాకర్,డ్రైవర్ సుబ్రహ్మణ్యంల ఉదంతాలే సజీవ సాక్ష్యాలని పేర్కొన్నారు.డాక్టర్ సుధాకర్ వేధింపుల పర్వం (మే 2021)నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో సుదీర్ఘంగా 20 ఏళ్లకు పైగా విశేష సేవలందించి,ప్రజల్లో ఎంతో మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకున్న దళిత డాక్టర్ సుధాకర్‌ను కరోనా విపత్తు సమయంలో కనీస ప్రాణరక్షణ కోసం మాస్కులు,పీపీఈ కిట్లు అడిగినందుకు అప్పటి ప్రభుత్వం అమానుషంగా వేధించింది.ఆయనపై రాజకీయ ముద్ర వేసి సస్పెండ్ చేయడమే కాకుండా,నడిరోడ్డుపై అర్ధనగ్నంగా మార్చి, చేతులు వెనక్కి విరిచి కట్టి బంధించి లాఠీలతో కొట్టారు.తీవ్ర మానసిక శోభకు గురిచేసి,చివరకు 2021 మే 21న ఆయన మరణించేలా చేశారు.ఈ నెల 21తో ఆయన కన్నుమూసి ఐదేళ్లు అవుతున్నా ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం విస్మరించలేనిది.డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం దారుణ హత్య (మే2022) కాకినాడకు చెందిన 26 ఏళ్ల దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం, వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు.2022 మే 19 రాత్రి కాగా,కొందరు వ్యక్తులు అతన్ని ఇంటి నుంచి తీసుకెళ్లారు. అర్ధరాత్రి దాటాక ఎమ్మెల్సీ అనంతబాబే స్వయంగా సుబ్రహ్మణ్యం శవాన్ని తన కారులో వేసుకొచ్చి,యాక్సిడెంట్ అని నమ్మబలుకుతూ కుటుంబ సభ్యులకు డోర్ డెలివరీ చేశారు.పోస్టుమార్టం నివేదికలో సుబ్రహ్మణ్యం ఒంటిపై 31 చోట్ల బలమైన కత్తిగాట్లు, గాయాలు ఉన్నట్లు తేలింది.ఇంతటి ఘోరం జరిగినా అప్పటి సీఎం జగన్ కనీసం స్పందించలేదు సరేకదా, నిందితుడికి కొద్దిరోజులకే బెయిల్ వచ్చేలా చేసి స్వేచ్ఛగా తిరిగేలా ప్రోత్సహించారు.*జగన్ పాలనలో (2019-24) దళితులపై అణచివేత గణాంకాలు గత ఐదేళ్లలో దళిత సమాజంపై జరిగిన వ్యవస్థీకృత దాడుల ఖచ్చితమైన కేంద్ర ప్రభుత్వ మరియు ఎన్‌సిఆర్‌బి (NCRB) లెక్కలను ఎమ్మెల్యే గణబాబు ఈ సందర్భంగా మీడియా ముందుంచారు మారణహోమం & దాడులు జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 220 మంది దళితులు దారుణంగా హత్యకు గురయ్యారు. దళితులపై జరిగిన అధికారిక దాడుల సంఖ్య 56,981 కి చేరింది. అదే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో (2014-19) కేవలం 8,211 కేసులు ఉంటే, వైసిపి హయాంలో దాడులు ఏకంగా 10 రెట్లు పెరిగాయి..దళిత మహిళలపై అరాచకాలు రాష్ట్రంలో దళిత మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా 637 అత్యాచార సంఘటనలు జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే దళిత మహిళలపై దాడుల్లో ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉందని ఎన్‌సిఆర్‌బి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన అనుష,పులివెందులలో నాగమ్మ,అనంతపురంలో జూనియర్ నేషనల్ ప్లేయర్ స్నేహలత,గుంటూరులో రమ్య వంటి ఎందరో దళిత ఆడబిడ్డలను అత్యంత క్రూరంగా రేప్ చేసి హత్య చేశారు.పులివెందులలో బాధితులను పరామర్శించడానికి వెళ్లిన వారిపైనే రివర్స్‌లో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం జగన్ అహంకారానికి పరాకాష్ట.భూముల దోపిడీ దళితుల జీవనాధారమైన 11,000ఎకరాల అసైన్డ్ భూములను జగన్ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్,రీ-సర్వేల పేరుతో బలవంతంగా లాక్కుని దళితులను రోడ్డున పడేసింది.ప్రశ్నిస్తే ప్రాణాలు తీసే సంస్కృతి మదనపల్లిలో వైన్ షాప్ దగ్గర మద్యం నాణ్యత లేదని ప్రశ్నించి, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినందుకు వైసిపి లీగల్ సెల్ కార్యకర్త ఓం ప్రతాప్‌ను మరుసటి రోజే అనుమానాస్పద స్థితిలో చంపేశారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు వరప్రసాద్ అనే దళిత యువకుడికి గుండు కొట్టించి అవమానించారు. కడప వెటర్నరీ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ అచ్చన్నను కులం పేరుతో మానసిక వేధింపులకు గురిచేసి అంతమొందించారు.రాజకీయ ప్రయోజనాల కోసం ‘కోడి-కత్తి’ కేసు పేరుతో దళిత యువకుడు జనిపల్లి శ్రీనును ఐదేళ్లపాటు బెయిల్ రాకుండా జైల్లో మగ్గేలా చేశారు. కోనసీమ జిల్లాకు డా. బి.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టి, దానిని వివాదంగా మలిచి కులాల మధ్య కుంపట్లు రాజేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూశారు.ఇప్పటికీ మారని వైసిపి లీగల్ సెల్ అరాచకాలు ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమై ప్రజలు చెంపదెబ్బ కొట్టినా వైసిపి నాయకుల తీరు మారలేదని గణబాబు మండిపడ్డారు. ఇటీవల అన్నమయ్య జిల్లాలో వైసిపి లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి తన 20 మంది అనుచరులతో కలిసి మండల పరిషత్ ఆఫీసు (MPDO) లో చొరబడి, దళిత అధికారి అయిన యంపిడిఓ జవహర్ బాబుపై ఇష్టారాజ్యంగా దాడి చేశారని గుర్తుచేశారు.ఎంపీపీ వచ్చాక తాళం తీస్తామని చెప్పినందుకు.మాకు ఎదురు చెప్తావా అంటూ కిందపడేసి తన్నారు.అడ్డు వచ్చిన అటెండర్,డ్రైవర్‌ను కూడా చితకబాది తాళాలు పగలగొట్టడం వారి శాడిజానికి నిదర్శనమన్నారు.* *రూ. 33,000 కోట్ల సబ్‌ప్లాన్ నిధుల దారిమళ్లింపు ఎన్నికలొస్తే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు”* అంటూ ఓట్ల కోసం నాటకాలడే జగన్ మోహన్ రెడ్డి, అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ. 27,000 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ. 5,000 కోట్లు… మొత్తం రూ. 33,000 కోట్ల రాజ్యాంగబద్ధమైన సంక్షేమ నిధులను దారిమళ్లించి, దళితులకు అందాల్సిన సబ్సిడీలు, లోన్లు, గ్రాంట్లు రాకుండా కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు.కూటమి ప్రభుత్వంలో దళితులకు సముచిత స్థానం – సువర్ణ అధ్యాయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంలో,ఎన్డీయే కూటమి ప్రభుత్వం దళితుల ఆత్మగౌరవం,రక్షణ, హక్కులను కాపాడటమే పరమావధిగా పనిచేస్తోందని ఎమ్మెల్యే గణబాబు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ప్రస్తుత 2026-27 బడ్జెట్లో ఎస్సీ సంక్షేమానికి ఏకంగా రూ. 22,000 కోట్లు కేటాయించాము.గత వైసిపి ప్రభుత్వం దుర్మార్గంగా రద్దు చేసిన 18 దళిత సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది.దళిత యువతను కేవలం కార్మికులుగా కాకుండా, పారిశ్రామికవేత్తలుగా (Industrialists) తీర్చిదిద్దేందుకు ప్రత్యేక సబ్సిడీలు,ప్రోత్సాహకాలను అందిస్తున్నాము.గత ఐదేళ్ల జగన్ అరాచక పాలనపై దళిత వాడల్లో,గ్రామాల్లో విస్తృతంగా చర్చ జరగాలని, బాధితులందరికీ కూటమి ప్రభుత్వం అండగా నిలబడి న్యాయం చేకూరుస్తుందని ఎమ్మెల్యే గణబాబు భరోసా ఇచ్చారు.ఈ సమావేశంలో కూటమి దళిత నాయకులు నరవ అనూష,జోగేంద్ర,శ్రీ కుమార్, శివ,వర్మ,చైతన్య,శ్రీధర్, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.