నెల్లూరులో ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్మాణానికి అప్పు ఇచ్చి మోసపోయిన మహిళ ఆవేదన

మన ధ్యాస, నెల్లూరు, నవంబర్ 7: నెల్లూరు ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఉదయం మాదాల నాగభూషణమ్మ విలేకరుల సమావేశం నిర్వహించినారు. ఈ పత్రిక విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…… నెల్లూరు, పొదలకూరు రోడ్డు, నేతాజీ నగర్ లో మా ఇంటి పక్కన నివసిస్తున్న స్నేహితురాలు వి. ధనలక్ష్మి ఓల్డ్ ఏజ్ హోమ్ పెడదాం అని నాకు పదే పదే చెప్తుండగా సరే ముసలి వాళ్లకు సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో సరేనా అన్నాను. ఓల్డ్ ఏజ్ హోమ్ కు నిర్మాణానికి సుమారు ఐదున్నర సవర్ల బంగారు, నగదు 7,30,000 అప్పుగా ఇచ్చాను. ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టి పెట్టినట్టే తీసేసింది, ఇప్పటికి మూడు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఓల్డ్ ఏజ్ హోం ఏమైంది అని నేను అడగా ఫ్లెక్సీలు ఫోటోలు చూపిస్తూ కాలం గడిపింది, ఇంకా కుదరదు అని నేను తీసుకున్న బంగారం అమౌంట్ అడగగా ప్రతిసారి ఈరోజు ఇస్తాను, రేపు ఇస్తాను అని కాలం గడుపుతుంది, అంతేకాక ఈ విషయంపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ నాకు ఎక్కడా న్యాయం జరగలేదు అని అన్నారు.18 అక్టోబర్ 2025 సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ధనలక్ష్మి కుమారుడు సూరి అలియాస్ సూరజ్ అతని స్నేహితుడు ఒంటరిగా ఉన్న మా ఇంటి వద్దకు వచ్చి అసభ్య పదజాలంతో మాట్లాడి డబ్బు, బంగారం ఇవ్వము నువ్వు పోలీసులు వాళ్లకి అయినా, ఎస్పీ కైనా, కలెక్టర్ కైనా చెప్పుకో మమ్మల్ని ఏమి చేయలేరు అని అన్నారని మాదాల నాగభూషణమ్మ తెలిపారు.వి. ధనలక్ష్మి నుండి ,కుటుంబ సభ్యుల నుండి నాకు ప్రాణ హాని ఉందని ఆమె తెలియజేశారు.ఈ ఫలితంగా నాకు ధనలక్ష్మి నుండి ప్రాణహాని ఉందని కావున తక్షణం వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని నా ప్రాణ రక్షణ కోసం శాశ్వత రక్షణ కల్పించాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా పోలీసు వారిని కోరుచున్నానని ఆమె తెలియజేశారు.

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర