కావలి, మే 20 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
లైఫ్ లైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కావలిలోని రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో శిరీష రక్తదానం చేసారు. ఈ సందర్భంగా లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తాటికొండ నవీన్ మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉన్న సందర్భంగా రక్త నిధులలో రక్త కొరత ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని అన్నారు . రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో రక్త కొరతను గ్రహించి రక్తదానం చేసిన మేడమ్ శిరీష ఎంధరికో ఆదర్శప్రాయురాలయ్యారని అన్నారు. అత్యవసర సమయంలో రక్తదానం చేసిన శిరీషకి ధన్యవాదాలు తెలిపారు. ప్రతీ ఒక్కరు ఈ క్లిష్ట సమయంలో రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకోవలన్నారు. లైఫ్ లైన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఎందరికో యువతకు మరియు గ్రామస్థాయిలో అవగాహనపరిచి వారిని రక్తదాన చైతన్యవంతులుగా చెస్తున్నామని తెలిపారు. అత్యవసర సమయంలో రక్తం అవసరమైన వారికి రక్తదాతలను వారు అడ్మిటైన ఆసుపత్రులకి పంపి రక్తదానం చెపిస్తున్నామని అన్నారు.