నెల్లూరులో ఎన్సిసి క్యాడేట్ల ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్రీయ ఏ కతా దివస్

మన ధ్యాస,నెల్లూరు, అక్టోబర్ 31:10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సిసి నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ మరియు కమాండింగ్ ఆఫీసర్ గణేష్ గొదంగవే ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వెంగళరావు నగర్ నెల్లూరు మరియు కెఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ బీవీ నగర్ నెల్లూరు ఎన్సిసి సెకండ్ ఆఫీసర్లు గుండాల నరేంద్రబాబు , సివి నాగరాజుల సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఉక్కుమనిషి, భారతరత్న, భారతదేశ తొలి ఉప ప్రధాని, హోంమంత్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ వెంగళ నగర్ నుంచి మెయిన్ రోడ్ కరెంట్ ఆఫీస్ సెంటర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు గుండాల నరేంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్సిసి క్యాడేట్లు ర్యాలీ చేశారు. కె ఎన్ ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ బీవీ నగర్ నుంచి సివి నాగరాజు ఆధ్వర్యంలో కరెంట్ ఆఫీస్ కూడలి వద్ద గల సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ఎన్సిసి క్యాడెట్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారి కాంస్య విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎన్సిసి ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు మాట్లాడుతూ….. సర్దార్ వల్లభాయ్ పటేల్ బాల్యం నుంచే దేశం యెడల అత్యంత దేశభక్తి భావాలు కలిగిన గొప్ప వ్యక్తి అని గాంధీజీ నాయకత్వంలో స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో అవిశ్రాంత పోరాటం చేశారని స్వాతంత్ర్యనంతరం భారతదేశానికి తొలి ఉప ప్రధానిగా హోం శాఖ మంత్రిగా ఎన్నో విశిష్ట సేవలు అందించారని భారతదేశంలో కలవడానికి ఇష్టపడని 562 సంస్థానాలను అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి అత్యంత లౌక్యంతో సైనిక చర్య ద్వారా భారతదేశంలో ఈనం చేయడానికి అవిశ్రాంతంగా పనిచేశారని ముఖ్యంగా మహారాష్ట్రలోనే జునాగడ్ సంస్థానం తెలంగాణలోని హైదరాబాద్ సంస్థానం నేనిక చర్య ద్వారా భారత దేశంలో విలీనం చేసి తన సమర్ధతను పటేల్ నిరూపించుకున్నారని, జాతీయ సమైక్యతకు పాటుపడిన మహనీయుడు పటేల్ అని కొనియాడారు. అందువల్లనే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 అక్టోబర్ 31 నుంచి పటేల్ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని వారు జన్మించిన గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నది ఒడ్డున అత్యంత ఎత్తైన పటేల్ విగ్రహాన్ని నిర్మించి వారికి ఘన నివాళులు అర్పించారని భారత దేశ సమైక్యతకు వారు చేసిన కృషిని ఎప్పటికీ మరువరానిదని ఆ మహనీయుని స్మరించుకోవడం వారి అడుగుజాడల్లో పయనించడానికి బాల్యం నుంచే ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని వారి పోరాటపటిమను దేశభక్తి భావాలను ధైర్య సాహసాలను మనం అలవర్చుకున్నప్పుడే వారికి నిజమైన నివాళి ఔతుందన్నారు. ఈ కార్యక్రమంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు, సెట్నెల్ సీఈవో నాగేశ్వర రావు, ఎన్సిసి పిఐ స్టాఫ్ పెట్టి ఆఫీసర్ లక్ష్మణ కుమార్, ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాల సంతపేట ఎన్సిసి థర్డ్ ఆఫీసర్ డి.పెంచలయ్య, ఎన్సిసి క్యాడెట్లు విరివిగా పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు.

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం