కొండాపురం అక్టోబర్ :(మన ధ్యాస న్యూస్)://

కొండాపురం మండలం సాయిపేట పంచాయతీ పరిధిలోని ఇస్కపాలెం గ్రామానికి చెందిన గంటా గోపి అకాల మరణం చెందడం దురదృష్టకరం. ఈ విషాదకర ఘటనపై ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ వ్యక్తిగతంగా ఇస్కపాలెం గ్రామాన్ని సందర్శించి, మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారికి ధైర్యం చెబుతూ ఈ క్లిష్ట సమయంలో తాను వారి పక్షాన ఉన్నానని భరోసా ఇచ్చారు. కుటుంబానికి కలిగిన తీవ్ర నష్టాన్ని పూరించలేమని పేర్కొంటూ, తన ప్రగాఢ సానుభూతిను వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామస్థులు కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేష్ తో కలిసి కుటుంబానికి మద్దతు తెలుపుతూ నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *