కొండాపురం అక్టోబర్ :(మన ధ్యాస న్యూస్):///

మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న నిరంతర భారీ వర్షాల కారణంగా అనేక గ్రామాలు, కాలనీలు నీటమునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలుస్తూ, తమ సేవా దృక్పథాన్ని మరోసారి చాటుకున్నారు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ .ఎమ్మెల్యే కొండాపురం మండలం పరిధిలోని సాయి పేట పంచాయతీలోని సాయి పేట ఎస్సీ కాలనీ, కొమ్ముపాలెం, ఇస్కపాలెం వంటి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, ప్రజల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. స్థానిక ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న ఆయన, తక్షణ ఉపశమనం కల్పించే దిశగా చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఓరుగంటి సుమన్ మరియు దామా శివ బాబు సమన్వయంతో, వరద వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు దుప్పట్లు మరియు అవసరమైన సహాయక వస్తువులను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్వయంగా పంపిణీ చేశారు.ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే “ప్రజల కష్టాలు మా కష్టాలే. ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని సహాయ సహకారాలను త్వరితగతిన అందించేందుకు నేను వ్యక్తిగతంగా కృషి చేస్తాను. ఎవరూ ఇబ్బందులు పడకుండా ప్రతి కుటుంబానికి అవసరమైన సహాయం చేరేలా చూసుకుంటాను,”అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు విస్తృతంగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *