తవణంపల్లి అక్టోబర్ 7 మన ద్యాస
తవణంపల్లి మండలం, అరగొండ గ్రామపంచాయతీ వద్ద జరిగిన ఆటో డ్రైవరు సేవ పథకం ద్వారా లబ్ధి పొందిన ఆటో డ్రైవర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలుతెలుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి సహకరించిన పార్టీ నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులుఅందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా తవణంపల్లి మండల పార్టీ అధ్యక్షులు శ్రీ వెంకటేష్ చౌదరిమరియు మాజీ అధ్యక్షులు గాలి దిలీప్ కుమార్వారిఅమూల్యమైన సమయాన్ని కేటాయించి ఆటో డ్రైవర్లు అందరికీ సక్రమంగా వారికి చేరవలసిన మొత్తం చేరినదా లేదా అనేది పేరుపేరునా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు వెంకటేష్ చౌదరి, మాజీ అధ్యక్షులు దిలీప్, రంజిత్ రెడ్డి, రఘు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు







