
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
యన్ డి ఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఆర్ధిక భరోసా దిశగా జి యస్ టీ సంస్కరణలు చేపట్టిందని యర్రవరం కూటమి నాయకులు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలమేరకు నాయకులు బస్సా ప్రసాద్,మైరాల కనకరావు ఆధ్వర్యంలో యర్రవరం గ్రామంలో సూపర్ జి యస్ టి, సూపర్ సేవింగ్స్ ర్యాలీ చేపట్టారు.పలు వ్యాపార సంస్థల వద్ద సూపర్ జి యస్ టి, సూపర్ సేవింగ్స్ కరపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జి యస్ టీ సంస్కణల వల్ల సన్న చిన్నకారు రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుందని అన్నారు.ఆధునిక యంత్రాల ధరలు తగ్గుతాయని, దీనివల్ల సుస్థిర వ్యవసాయం మెరుగుపడుతుందని తెలిపారు.రైతులకు,
విద్యారంగానికి,చిరు వ్యాపారులకు,యువ సాంకేతిక నిపుణులకు,పేద మధ్యతరగతి వర్గాలకు, పేద మధ్యతరగతి గృహిణులు కు మేలు జరగనుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇటువంటి సంస్కరణలుచేపట్టడం వల్లన రాష్ట్రలో పలు రంగాల వారికి లాభం చేకూరుతుందని అన్నారు.ఈ టీడీపీ నాయకులు తోట వెంకటేశ్వరరావు, నక్కా కృష్ణ, జనసేన నాయకులు గంగిరెడ్ల మణికంఠ, ఆకులనాని, సచివాలయం సిబ్బంది బండారు నానాజీ, తదితరులు పాల్గొన్నారు









