శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సిద్దివారిపాలెం గ్రామంలో గల ఆంధ్రా శబరిమల అయ్యప్ప స్వామిని శుక్రవారం కాకినాడ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె.వి నాగేంద్ర తన తోటి సిబ్బందితో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కుసుమంచి శ్రీనివాసరావు గురుస్వామి అధికారి నాగేంద్ర చేత స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రసాదం అందజేసి ఈ నెలలో ఆలయం వద్ద జరిగే మహా కుంభాభిషేకం, మహా కోటిబిల్వార్చన పూజా కార్యక్రమాలకు హాజరుకావాలని నాగేంద్ర కు, తన సిబ్బందికి శ్రీనివాసరావు గురుస్వామి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ, పచ్చని ప్రకృతి నడుమ ఆంధ్రా శబరిమలై కేరళ శబరిమలై మాదిరిగా ఉందని, ప్రతి ఒక్కరూ సందర్శించవలసిన ప్రాంతమని, 18 కొండల్లో ఆంధ్రా శబరిమలై ను నిర్మించిన కుసుమంచి శ్రీనివాసరావు గురుస్వామిని అభినందించారు.









