• అన్నవరం దేవస్థానం ఈవో వి సుబ్బారావు…
  • మహిళలకు ఆరోగ్యం పోషకాహారంతోనే..
  • గ్రామ సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా

శంఖవరం /అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) నిస్వార్థంగా వైద్య సేవలను అందించే వైద్యులు దేవుళ్ళతో సమానమని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు “స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్” పధకం ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలోని అన్నవరం లో ప్రత్యేక వైద్య శిబిరాలను బుధవారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు, గ్రామ సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా ప్రారంభించారు. వైద్య బృందం ఏర్పాటు చేసిన మందులు పంపిణీ, ఔట్ పేషెంట్ల వివిధ ప్రత్యేక వైద్య పరీక్షల నిర్వహణా విభాగాలు ఏర్పాటుచేసి సుమారు 150 మందికి శంఖవరం మండల వైద్యాధికారి ఎస్ఎస్ రాజీవ్ కుమార్, ఆరోగ్య కేంద్రం ద్వితీయ వైద్యులు మోహన్ సాయిరెడ్డి, అన్నవరం దేవస్థాన ఆసుపత్రి వైద్యులు ఎ .హరికృష్ణ, వైద్య అధికారిని మౌనిక వివిధ పరీక్షలు నిర్వహించారు. అనంతరం మహిళలకు రోగాల బారిన పడకుండా అవగాహన కల్పించారు. మందులను ఉచితంగా పంపిణీ చేశారు.అనంతరం నిర్వహించిన వైద్య అవగాహనా సభలో వైద్య బృందం, ప్రజలనూ ఉద్దేశించి ఏ స్థాయి వైద్యులైనా నిస్వార్థంగా వైద్య సేవలను అందిస్తూన్న వైద్య బృందం మనకు దేవుళ్ళతో సమానమని దేవస్థానం ఈవో వి. సుబ్బారావు పేర్కొన్నారు. కరోనా తర్వాత మనిషికి అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తు తున్నాయి. చిన్న రోగాలను సైతం పెద్ద రోగాలుగా చెప్తూ నమ్మించి కార్పోరేట్ ఆసుపత్రులు వైద్యం చేస్తున్నాయంటూ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే న్యాయమైన వైద్య సేవలు అందుతున్నాయని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. కూటమి ప్రభుత్వం సారధ్యంలో ఈ ప్రత్యేక వైద్య శిబిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, దీంతో మహిళలకు మరింత ఆరోగ్య రక్షణ కలుగుతుందని పేర్కొన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ శెట్టి కుమార్ రాజా మాట్లాడుతూ, ప్రతి కుటుంబానికి మహిళా మూల స్తంభమని అందువలన వారు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం సుభిక్షంగా ఉంటుందని మహిళలందరూ పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అన్నవరం సచివాలయం- 3 ఎంఎల్హెచ్.పి. పులి సుజాత, ఎ ఎన్ ఎం బి. సత్య కళావతి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కత్తిపూడి సెంటర్ సూపర్వైజర్ రజిని, తదితర ఎంఎల్హెచ్.పి.లు,ఎ ఎన్ ఎం లు, అంగన్వాడి సిబ్బంది, ఆశా వర్కర్లు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *