చిత్తూరు సెప్టెంబర్ 20 మన ద్యాస

చిత్తూరు జిల్లా..చిత్తూరు గత సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మునుపెన్నడూ లేని రీతిలో అత్యధిక మెజారిటీతో ఘనవిజయం సాధించి,అనతికాలంలోనే చిత్తూరు కీర్తిని పార్లమెంటులో ప్రస్తావించడమే కాకుండా,పార్లమెంటుకు నిత్యవిద్యార్తిలా క్రమశిక్షణగా హాజరుకావడం,నిరంతరం తన ప్రశ్నలతో,తన ప్రాంత అభివృద్ధి కొరకు కావలసిన అంశాలపై,అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ శాఖలతో సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ నిరంతరం చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు పనితీరు అద్భుతం అని,చిత్తూరు ప్రజలకు ఆయనో వరం అని చిత్తూరు జిల్లా జనసేన నాయకులు ఎం మహేష్ స్వేరో కొనియాడారు..2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్ సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నివేదికలో ప్రశ్నల కేటగిరీలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మొత్తం 82ప్రశ్నలతో మూడో స్థానంలో నిలవడం,92.65 శాతం హాజరుతో నాల్గవ స్థానంలో నిలవడం చాలా గొప్ప విషయమని ఈ సందర్భంగా ఆయనకి జనసేన పార్టీ తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని ఎం మహేష్ స్వేరో తెలిపారు.ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలకు మేలు చేయడానికి,రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మాత్రమే పనిచేస్తుందని,రాష్ట్ర ప్రజల శ్రేయస్సు మాత్రమే తమకు ముఖ్యమని తెలిపారు. దగ్గుమల్ల ప్రసాదరావు లాంటి గొప్ప నాయకుడిని చిత్తూరు ప్రజలకు ఎంపీగా ఎన్నికచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *