మన ధ్యాస ,వెంకటాచలం, సెప్టెంబర్ 4 :*భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు సన్నాహాలు .*త్వరలోనే నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభం.*మహిళల కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. నెల్లూరు జిల్లా ,వెంకటాచలం మండలం కసుమూరులో శ్రీ మస్తానయ్య దర్గాను గురువారం సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్.దర్గా ప్రాంగణాన్ని పరిశీలించి భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ఆరా తీసిన ఇద్దరు నాయకులు.వక్ఫ్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కసుమూరుకు విచ్చేసిన అబ్దుల్ అజీజ్ కు ఆత్మీయ స్వాగతం పలికిన టీడీపీ నేతలు, ముస్లిం సోదరులు.ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ………….కసుమూరులోని మస్తానయ్య దర్గా మతసామరస్యానికి ప్రతీక…కులమతాలకు అతీతంగా దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు అని అన్నారు.దేశంలోనే పేరుగాంచిన దర్గా మన సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండటం మనందరి అదృష్టం అని అన్నారు.కసుమూరులోని కళ్యాణ మండపాన్ని పునర్నిర్మించి సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు పలు హామీలు ఇచ్చిన అజీజ్ భాయ్ కు ధన్యవాదములు తెలియజేశారు. భక్తులకు వసతికల్పించేందుకు గదుల నిర్మాణం చేపడతామన్నారు .మహిళల కోసం ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు . .వసతులు కల్పించేందుకు అదనంగా స్థలం అవసరమైనా సేకరించి భక్తులకు సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు .మరుగుదొడ్లకు రుసుం వసూలు చేసే స్వస్తి పలికి ఉచితంగా ఉపయోగించుకునే సౌకర్యం తెస్తామన్నారు .త్వరలోనే రోజూ మధ్యాహ్నం భక్తులకు అన్నదానం ప్రారంభించేందుకు చర్యలు చేపడుతామన్నారు .ఈ కార్యక్రమానికి మా వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం అని అన్నారు.కసుమూరు దర్గాకు వైభవం తెస్తాం అని అన్నారు. ఆధ్యాత్మికంగానూ, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం అని అన్నారు.అనంతరం ఈ సందర్భంగా షేక్ అబ్దుల్ అజిత్ మాట్లాడుతూ………కసుమూరు దర్గాలో అవసరమైన అన్ని పనులు చేపట్టి భక్తులకు సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తాం అని అన్నారు.త్వరలోనే నిత్యాన్నదానం ప్రారంభించబోతున్నాం అని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో 26 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాం..అందులో ఒకటి కసుమూరులో పెడతాం అని అన్నారు.ఏఐ, కంప్యూటర్, టాలీ వంటి డిజిటల్ స్కిల్స్ తో పాటు సంప్రదాయ స్కిల్స్ ను మహిళల్లో పెంపొందించే ప్రయత్నం చేస్తున్నాం అని అన్నారు.రాష్ట్రంలోనే మొట్టమొదటిగా 100 మంది మహిళల కోసం సర్వేపల్లి నియోజకవర్గంలోని కసుమూరులో ప్రారంభించబోతున్నందుకు సంతోషంగా ఉంది అని అన్నారు.ఏఎస్ పేట దర్గాతో పాటు నెల్లూరు బారాషహీద్ దర్గాల్లో భక్తులకు అవసరమైన అన్ని వసతులు కల్పించడంతో పాటు నెల్లూరులో నాలుగు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాం అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *