

.మన ధ్యాస, నెల్లూరు, ఆగస్టు 30:నెల్లూరు కుక్కల గుంట 47వ డివిజన్ రాజేంద్రనగర్ లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వినాయక చవితి వేడుకలకు వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరై గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయ కృష్ణారెడ్డి, వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి,46 వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు ఉమా మహేష్ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తో కలిసి భక్తులకు అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు శేషయ్య, సాదా గోపి, శంకర్, ఇందిర, లక్ష్మి, మాధవి, నాగమని, శివ తదితరులు పాల్గొన్నారు.


