

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:-
ఆపదంటే నేనున్న అంటూ భరోసానిస్తూ, దళిత పేద ప్రజలకు నిత్యం సేవలందిస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజల మన్నలను పొందుతున్న కొండ్రపు నాని కీ ప్రతిపాడు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇంచార్జ్ గుణపర్తి అపురూప్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరంలో దళిత ఉద్యమ నాయకుడు, నిత్యం యువతను ప్రోత్సహించే కొండ్రపు నాని నాయుడు పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో గల యువత భారీ సంఖ్యలో కేక్ కటింగ్ నిర్వహించి స్వీట్లు పంచారు. అనంతరం ప్రత్తిపాడు బిఎస్పీ పార్టీ ఇన్చార్జి అపురూప్, నియోజకవర్గ జనరల్ సెక్రెటరీ బత్తిన తాతాజీ మరియు యువత మాట్లాడుతూ, నాని పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, నిరుపేదలకు అండగా నిలుస్తూ, ఆపదంటే వెన్నఅంటూ ఉండి నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు. దళితుల అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో దళిత ప్రజా సమితి ప్రత్తిపాడు నియోజకవర్గ అధ్యక్షుడు గుడాల జాన్, జై భీమ్ యూత్ సభ్యులు బత్తిన శివరాం, గెడ్డం రవీంద్ర, అంబటి మనోజ్, కాపారపు నాని, చవల చందు, కాపారపు అనిల్ కుమార్, ఠాగూర్, సుంకర దుర్గ, చిరుకూరి శ్యామ్,చిరుకూరి వివేక్ భారీ సంఖ్యలో యువత పాల్గొన్నారు.