బీ కేర్ ఫుల్.. యాత్రల పేరుతో ఘరానా మోసం

Mana News :-  ఉప్పల్ లో యాత్రల పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకుడు భరత్ కుమార్ పుణ్య క్షేత్రాల పేరుతో ఆఫర్స్ ప్రకటించి కోట్లలో వసూళ్లకు పాల్పడ్డాడు. మానస సరోవరం ఇతర టూర్స్ పేరిట సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేశాడు. ఐదేళ్లుగా రూ.15 కోట్లు వసూలు చేసినట్లుగా గుర్తించారు అధికారులు. దాదాపు 500 మందికిపైగా బాధితులు ఉన్నారు. బాధితులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. భరత్ కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన బాధితులు ఉన్నారు. అమెరికా నుంచి బాధితులు ఉన్నారు. తన అసిస్టెంట్ డబ్బులు ఎత్తుకెళ్లిపోయాడని అతడి మీద నెపం వేయాలని భరత్ కుమార్ చూశాడు. ఇంతలో అలర్ట్ అయిన అసిస్టెంట్.. మా అందరిని కలిపి ఒక గ్రూప్ చేశాడు. ఆఫీస్ నుంచి డేటా తీసుకుని వచ్చి గ్రూప్ ను ఫార్మ్ చేశాడు. అలా చేయడం వల్లే ఇంతమంది బాధితులం ఉన్నామని మాకు తెలిసింది. లేదంటే తెలిసేది కాదు. మానస సరోవరం చూడాలనే సంక్పలంతో నేను రూ.2లక్షలు ఇచ్చాను. పంపిస్తాను అని చెబుతూనే ఉన్నారు. ఇలా రెండున్నరేళ్లు గడిచిపోయాయి.

నేను ఒక్కడినే కాదు మరో 250 మంది వరకు రూ.2 లక్షల చొప్పున కట్టారు. కర్నాటక, తెలంగాణ, ఏపీలకు చెందిన వారి నుంచి డబ్బు తీసుకున్నాడు. కబుర్లు చెప్పాడు తప్ప మమ్మల్ని ఎక్కడికీ తీసుకెళ్ల లేదు. వీసా రాలేదని ఇచ్చి డబ్బు కంటే తక్కువ డబ్బుని కొంతమందికి ఇచ్చాడు. మేము గత మూడు నెలల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం. అందరం ఫిర్యాదులు ఇచ్చాం. కానీ, మాకు ఎలాంటి స్పందన కనిపించలేదు. పుణ్య క్షేత్రాలకు తీసుకెళ్తానని చెప్పి మా అందరినీ భరత్ కుమార్ మోసం చేశాడు” అని బాధితులు వాపోయారు. మరో ట్రావెల్ మోసం హైదరాబాద్ నగరంలో వెలుగుచూసింది. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్తామంటూ గాయత్రి టూర్స్ ట్రావెల్స్ నిర్వాహకుడు భరత్.. వందలాది మందిని మోసగించాడు. కోట్ల రూపాయలు వసూలు చేసి కుచ్చు టోపీ పెట్టాడు. కాగా, భరత్ పై గతంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్ లోనూ మోసం చేసిన కేసు నమోదైంది. అప్పుడు భరత్ ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన భరత్.. మరోసారి అదే దందా చేశాడు. యాత్రల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డాడు. తమకు న్యాయం చేయాలని, తమ డబ్బు తమకు ఇప్పించాలని, మాయ మాటలతో మోసం చేసిన భరత్ ను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..