

శంఖవరం /ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మండలం లో యూజె పురం లో ప్రసిద్ధి గాంచిన వినాయకుని ఆలయంలో మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని యూజే పురం వైసీపీ నాయుకులు పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నడిగట్ల త్రిమూర్తులు మాట్లాడుతూ భగవంతుణ్ణి ఆశీస్సులతో ప్రజలందరి అభిమానాలతో ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవలు అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ రామిశెట్టి నాని, ఎంపీటీసీ మేడసాని సింహాద్రి, వట్టి కోళ్ల నూకరాజు, పప్పల చక్రం, తేటకాయల నూకరాజు, కర్ణం చందర్రావు, తదితరులు పాల్గొన్నారు.