చేతి వృత్తులకు చంద్రబాబు చేయూత -కోట చంద్రశేఖర్,నాయీ బ్రాహ్మణ సాధికార సమితి

శ్రీకాళహస్తి, మన న్యూస్ :- గత వైసిపి ప్రభుత్వ నిర్వాకం కారణంగా తీవ్రమైన నిర్లక్ష్యానికి గురై,సాంప్రదాయికంగా మరియు వంశ పారంపర్యంగా వస్తున్న కొన్ని కులవృత్తుల వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు చేతి వృత్తుల వారికి చేయూత అందిస్తున్నారని తెలుగుదేశం పార్టీ, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు నాయకుడు కోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. చేతి వృత్తుల పై ఆధారపడి జీవించే వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు అవసరమైన ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఎన్డీయే కూటమి పెద్దలు నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు మరియు సుధీర్ రెడ్డి చిత్రపటాలకు మంగళవారం స్థానిక పూసల వీధి కూడలిలో తెలుగుదేశం పార్టీ బిసి విభాగం నాయకులు పాలాభిషేకం చేశారు. ‘ఆదరణ’ పథకం ద్వారా బీసీ సామాజికవర్గాల్లోని చేతివృత్తుల వారి ఆర్థికాభివృద్ధి కోసం యంత్రాలు,పరికరాలు ఇచ్చి గతంలో టిడిపి ప్రభుత్వం అండగా నిలిచింది అని, కానీ జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఆ పథకాన్ని దుర్మార్గంగా రద్దు చేసి బిసి లకు తీరని నష్టం కలిగించింది అని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల ప్రచార సమయంలో బీసీ లకు ఇచ్చిన హామీ లను అమలు చేస్తున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం, నేడు నాయీ బ్రాహ్మణులు నిర్వహించే సెలూన్ లకు ఉచిత విద్యుత్ ను 150 నుండి 200 యూనిట్లు అందిస్తున్నది, అలాగే ఆదరణ పథకం ద్వారా 90% సబ్సిడీతో పనిముట్లు పంపిణీ మరియు దేవాలయాలలో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు 25,000 వేలకు వేతనాలు పెంపు వంటి నిర్ణయాలు నాయీ బ్రాహ్మణులకు జీవితాలకు భరోసా కల్పిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. చేతి మగ్గాలకు 200, మర మగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వడం, 5 కోట్ల రూపాయలతో థ్రిస్ట్ నిధి ఏర్పాటు, 50 సంవత్సరాలు దాటిన నేత కార్మికులకు 4000 రూపాయలు పెన్షన్ వంటి నిర్ణయాలు తీసుకున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి చేనేతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు.
గీత కార్మికులకు ఆర్థిక భరోసా ఇవ్వటానికి గాను మద్యం దుకాణాలలో మరియు బార్ లలో పది శాతం కేటాయింపు చేయడం పట్ల గీత కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రెడ్డి వారి గురవారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దశరధాచారి, వన్నియకుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి డైరెక్టర్ మిన్నల్ రవి, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, తంగేళ్ళ పాలెం సింగిల్ విండో ఛైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు లక్కమనేని మధుబాబు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మునిరాజా యాదవ్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి, తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్, వజ్రం కిషోర్, శ్రీకాళహస్తి పట్టణ సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్ డి.వి.నారాయణ, రాఘవులు యాదవ్, సులేమాన్, బిసి విభాగం నాయకులు మణి, సంజాకుల మురళీకృష్ణ, బీమాల చంద్రబాబు వెంకటరమణ, రామచంద్రయ్య, వెంకటేశ్వర్లు, అన్నవరపు గోపి, డి కృష్ణమూర్తి, ఆవులపాటి యుగంధర్, గంగలపూడి రమేష్, రఘు, సతీష్,శేఖర్,ముని వెంకయ్య, సుబ్రహ్మణ్యం, వరుణ్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 1 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు