

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం “కలపాడు” గ్రామ దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల పేద ప్రజలందరికీ కుటుంబానికి రెండు ఎకరంలో చొప్పున పంచాలని కోరుతూ సోమవారం రోజు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సుమారు 110మంది భూమిలేని నిరుపేదలు ధర్నా నిర్వహించడం జరిగింది. సి.పి.యం పార్టీ వెంకటగిరి ఏరియా కన్వీనర్ వడ్డీపల్లి చెంగయ్య మాట్లాడుతూ వెంకటగిరి మండలం కలపాడు గ్రామ పరిధి సర్వే నెంబర్ 1 లో 1441.30 ఎ ” సెంట్లు ప్రభుత్వ భూములు ఉన్నాయని రెవెన్యూ రికార్డుల ప్రకారం మేత పరంబోకుగాను అడవి పరంబోకుగాను ఉన్నాయని, కలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో భూమిలేని దళితులు, గిరిజనులు, ఇతర వెనకబడిన సామాజిక తరగతుల వారు 300 కుటుంబాలు వారు నివాసాలు ఉంటున్నారని. కూలి పని తప్ప వారి అందరికీ వేరే జీవనాధారం లేదని. 2013 వ సంవత్సరం నుండి ఈ భూమిలో చెట్టు, పుట్టా, కొట్టుకుని ఉంటున్నారని. పేదలు ఈ భూముల్లోకి వెళితే కేసులు నమోదు చేస్తున్నారు. 2014వ సంవత్సరంలో దళిత దిజనుల మీద కేసు కూడా నమోదు చేసి ఉన్నారు. ఇప్పుడు రాజకీయ పలుకుబడి కలిగిన పెత్తందారులు జె.సి.బి.లు పెట్టి ఆక్రమణలు చేసుకుంటూ ఉన్నా వారి జోలికి మాత్రం ఎవరు వెళ్లడం లేదు. అగ్రకుల పెత్తందారులు రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వారు ఎంపీటీసీ భర్త శంకరయ్య వారి అనుచరులు సుమారు 45 ఎకరాల దాకా ఆక్రమణ చేసి ఉన్నారు. వీఆర్వో కబ్జాదారులకు సపోర్టుగా ఉంటూ దళితులకు అన్యాయం చేస్తున్నారు. ఇదే సర్వే నెంబర్లో సుమారు 100 ఎకరాల లోపు పట్టాలు ఇచ్చి ఉన్నారు. సెంటు భూమిలేని నిరుపేదలందరము మేము 2013 వ సంవత్సరం నుండి అర్జీలు పెట్టుకుంటూనే ఉన్నాము కానీ ఇంతవరకు న్యాయం జరగలేదు
కావున తమరు మా యందు దయవుంచి సర్వే నెంబర్ 1 లో గల ప్రభుత్వ భూమల్ని సెంటు భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేయాలని, పేదలకు ప్రభుత్వ భూములను దక్కకుండా కబ్జా చేస్తున్నటువంటి శంకరయ్య మరియు వారి అనుచరుల పైన వారికి సహకరిస్తున్న వీఆర్వో పైన చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ వెంకటగిరి ఏరియా కన్వీనర్ వడ్డేపల్లి చెంగయ్య గూడూరు ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్, సి.ఐ.టి.యు గూడూరు పట్టణ ప్రధాన కార్యదర్శి బి.వి.రమణయ్య, ఏం బేటి చంద్రయ్య, చెంచు కృష్ణయ్య చెంచు రామయ్య, బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
