

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో పుష్కర కాలువ గట్టుపై వెలిసిన శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ 8వ వార్షికోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో సుమారు 4000 మందికి పైగా భారీ కార్తీక అన్న సమారాధన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. పుష్పాలంకరణతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా కమిటీ సభ్యులు తీర్చిదిద్దారు. ముందుగా ఆలయ అర్చకులు సురేష్ శర్మ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నాయకుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఇంచార్జి వరుపుల తమ్మయ్య బాబు,సర్పంచ్,బుద్ధ సూర్య ప్రకాష్,ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గౌరీ సంఘ అధ్యక్షులు బుద్ద ఈశ్వరరావు,యువ నాయకుడు బుద్ద కృష్ణబాబు,శిలపరశెట్టి వెంకన్న బాబు తదితరులు హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా తగిన ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ చైర్మన్ కోడెల మురళితోపాటు కమిటీ సభ్యులని గ్రామ సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాష్,ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గౌరీ సంఘ అధ్యక్షుడు బుద్ధ ఈశ్వరరావు, యువ నాయకుడు బుద్ధ కృష్ణంరాజు అభినందించారు.ఈ కార్యక్రమంలో భీశెట్టి ఈశ్వర అబ్బాయి,భీశెట్టి వీరరాఘవ,కాళ్ల రామకృష్ణ,కరణం రాజారావు,ఆలయ కమిటీ చైర్మన్ కోడెల మురళీ కృష్ణ,కమిటీ సభ్యులు కోడెల దుర్గ,ఆళ్ల బుల్లబ్బాయి,ఆడారి వీరబాబు, ఆళ్ల శ్రీను,మళ్ళ పార్వతి,బుద్ధ నానాజీ,సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు,వేగి వీరబాబు,గ్రామంలో ఉన్న అన్ని దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నదాన ఏర్పాట్లను పర్యవేక్షించారు.