

మన న్యూస్: పాచిపెంట, నవంబర్ 29:-
పాచిపెంట లోవిద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని, విద్యార్థులే దేశ భవిష్యత్తు అని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.మండల కేంద్రమైన పాచిపెంట గ్రామం స్థానిక ఎంపీడీవో కార్యాలయం దగ్గర్లో నిర్మించిన బాలికల అదనపు వసతి గృహాన్ని ఆమె శుక్రవారం నాడు ప్రారంభించారు.ఒక కోటి 75 లక్షలు రూపాయలు తో నిర్మించిన భవనము ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మీరు చక్కగా చదువుకొని తల్లిదండ్రులు కన్న కలలు నిజం చేయాలని కోరారు. భోజనం బాగుంటుందా లేదని ప్రశ్నించారు. బాగుంటుందని విద్యార్థులు సమాధానం ఇచ్చారు. మీరు ఆటలు పాటలతో మానసిక శారీరకంగా ఎదుగుదల చెందాలని కోరారు. గతంలో నిలిచిపోయిన రోడ్లు, భవనాలు నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2000 రహదారులు అభివృద్ధి నిమిత్తం 2500 కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. గిరిజన ప్రాంతాల నుంచి డోలీలు మోతకు (చెక్)స్వస్తి పలుకుతున్నామని, గిరిజన గ్రామాలకు రహదారుల నిర్మాణం చేపట్టిన తర్వాత అవసరమైన మేరకు ఫీడర్ అంబులెన్స్లు ఉపయోగిస్తామని తెలిపారు. డోలీలు మోతలు ఇకపై ఉండవని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. హాస్టల్ విద్యార్థుల కు వరాలు కురిపించిన మంత్రి హాస్టల్స్ చదువుతున్న విద్యార్థులకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వరాల జల్లు కురిపించారు. గత ఐదేళ్లలో కాస్మోటిక్స్, ప్లేట్లు గ్లాసులు దుప్పట్లు, బెడ్ సీట్లు అప్పటి ప్రభుత్వం అందించలేదని త్వరలో అవన్నీ మీకు అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆమె తెలిపారు. మెనూలో మార్పులు తీసుకొస్తుందని మంచి పౌష్టికాహారం అందిస్తమని తెలిపారు. మాకు ఆట స్థలముతో పాటు,అదనపు మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలని ఒక విద్యార్థిని మంత్రిని కోరారు. విద్యార్థి మాటలకు ఆమె ఆనందం వ్యక్తం చేసి మీలో ప్రశ్నించే తత్వం మంచిదని మీకోసం ఈ ప్రభుత్వం అన్నివేళలా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని ఆమె హామీ ఇచ్చారు. కాంపౌండ్ వాల్కు ఫెన్సింగ్ వంటి ఇతర పనులు చేపట్టే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. ఆమె వెంట పార్వతీపురం ఐటీడీఏ ఈ ఈ మని రాజు, తహసీల్దార్ రవి, ఎం ఇ ఓ జోగారావు,ఏ ఇ సత్యనారాయణ, పాంచాలి సర్పంచ్ యుగంధర్,ఎంపీటీసీ ఉమా,ముఖి సూర్యనారాయణ, పూసర్ల నరసింగరావు, మాది రెడ్డి మజ్జా రావు,అలజంగి సీతారాం, నడి పల్లి బాబాకార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
