

త్వరలో మురళీకృష్ణంరాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు
(మన న్యూస్ ప్రతినిధి)ప్రత్తిపాడు: కార్తీక మాసంలో కులాల వారీగా వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడం చూస్తున్నాం.కానీ దానికి భిన్నంగా ప్రత్తిపాడు వైసిపి నేత మురళీ కృష్ణంరాజు మానసిక దివ్యాంగులకు, దివ్యాంగులకు వనభోజనాలు ఏర్పాటు చేసి తాను కూడా వారితో కలిసి భోజనం చేసి వారితో ఆప్యాయంగా గడిపారు. వివరాల్లోకి వెళితే ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం గ్రామంలో గల శాంతి వర్ధన ప్రత్యేక వికలాంగుల ఆశ్రమ పాఠశాల నందు పలువురు మానసిక వికలాంగులు, దివ్యాంగులు ఆశ్రమం పొందుచున్నారు. నియోజకవర్గ వైసిపి నేత ముదునూరి శుక్రవారం కార్తీకమాసం పురస్కరించుకుని దివ్యాంగులకు వనభోజనాలు ఏర్పాటు చేశారు. మురళీకృష్ణంరాజు వారితో కలిసి భోజనం చేసి, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముదునూరి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మానసిక వికలాంగుల పట్ల ప్రతి ఒక్కరూ ఆదరణ చూపాలని, ఈ అవకాశం దేవుడిచ్చిన వరంగా భావిస్తానని,పిల్లల మానసిక వికాసానికి కృషి చేస్తున్న శాంతి వర్ధిని సిబ్బంది సేవలు అభినందనీయమని అన్నారు.త్వరలోనే ముదునూరి మురళీకృష్ణం రాజు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నానని, ఈ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజల కష్టాల్లో పాలుపంచుకుని వారికి అండగా నిలుస్తానని తెలిపారు.ఇటీవల నియోజకవర్గంలో ముదునూరి చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలపే కార్యకర్తలు అభినందిస్తున్నారు.ఈ కార్యక్రమంలో కొండపల్లి అప్పారావు,దడాల సతీష్,బొబ్బిలి వెంకన్న, తాటిపాక కృష్ణ,రాయుడు రాజు,ఈగల రాఘవ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.