

మన న్యూస్ సాలూరు జూలై 29:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో కరడవలస గ్రామం లో మండల వ్యవసాయ అధికారి కే శిరీష ఆధ్వర్యం లో పొలం పిలుస్తుంది మరియు వరి పొలంబడి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు రసాయన పురుగు మందులు వలన పిచికారీ చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సరియైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన కలిగే అనర్థాలు ఒక నమూనా చిత్రపటం చూపించడం ద్వారా వివరించడం జరిగింది అలానే రైతులకు పొలంబడి కార్యక్రమం లో భాగంగా పంటలకు హానిచేసే శత్రు కీటకములు మరియు పంటలకు మేలు చేసే మిత్ర కీటకములు గురించి వివరించడం జరిగింది తదుపరి రైతుల అవగాహన నిమిత్తం ఒక నమూనా పరీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది తదుపరి రైతులకు వరి,మరియు మొక్కజొన్న పంటల ఎరువుల యాజమాన్యం మరియు పంట సాగు విధానాలు వివరించడం జరిగింది అలానే రైతులకు ప్రకృతి సేద్యం వలన కలిగే ప్రయోజనాలు వివరించడం జరిగింది ఈ కార్యక్రమం లో గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు వ్యవసాయ సహాయకులు హాజరు కావడం జరిగింది.
