

గూడూరు, మన న్యూస్ :- ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ శాఖ ఈనెల 26న జారీ చేసిన జీఓ ఎంఎస్. నెంబరు 134 ప్రకారం లేఔట్ క్రమబద్ధీకరణ స్కీం 2020కి ప్రభుత్వం కొన్ని సవరణలు చేసినట్లు గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. 2025 జూన్ 30కి ముందు రిజిస్ట్రేషన్ అయిన లేఔట్లు లోని ప్లాట్లను నిర్ణీత అపరాధ రుసుము, 14% ఓపెన్ చెల్లించి క్రమదీ కరించుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొ న్నారు. గూడూరు మున్సిపల్ పరిధిలోని రిజిస్ట్రేషన్ అయిన అన్ని లేఔట్లు, ప్లాట్లను ప్రభుత్వం నిర్దేశించిన మేరకు 10 శాతం పబ్లిక్ ప్లేస్ లేదా 14 శాతం పబ్లిక్స్ పీనలైజేషన్ చార్జీలతో సహా చెల్లించి క్రమద్ధీక రించుకోవాలన్నారు. లేఔట్ల యజమానులు, డెవలపర్లు, కొనుగోలుదారులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ పేర్కొన్నారు. అనధికార లే అవుట్లు వేసిన డెవలపర్లు లేదా భూమి యజమానులు లేదా నాన్ లేఔట్ యజమానులు ముందుగా వారి అనధికార లేఔట్ లోని అన్ని ప్లాట్లు వివరములు లేఅవుట్ స్కెచ్ ను వెంటనే గూడూరు మున్సిపల్ కార్యాలయము లో స్వయంగా కానీ వారి ప్రతినిధి ద్వారా గాని అందజేయవచ్చు అన్నారు. అవసరమైన వివరాలు, సలహాలు కొరకు గూడూరు మున్సిపల్ కార్యాలయము టౌన్ ప్లానింగ్ విభాగంలో సంప్రదించి పొందవచ్చు అన్నారు.