బద్వేల్: మన న్యూస్: జులై 24: జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పశువుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని కిరణ్ కుమార్ రెడ్డి మరియు పల్లె సుబ్బారెడ్డి ఇరువురు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారని, పంపిణీ చేయబడిన పశువులు అనారోగ్యంతో బాధపడుతూ చనిపోతున్నాయని, అధికారులు దీనిపై చర్యలు తీసుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ శాఖలో డాక్టర్లు ఉన్నా లేనట్లే అని వేలకు వేలు జీతాలు తీసుకుంటూ డ్యూటీ కి రారు అని అన్ని తామే అంటూ కాంపౌండర్లే చూసుకుంటారని అలా చూసుకోవడం వల్లే పశువులకు సరైన వైద్యం అందకపోవడం జరుగుతుందని, విజిట్ చేయవలసిన డాక్టర్లు రాకపోవడంతో కింది స్థాయిలో పూర్తిగా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని వారు అన్నారు. ప్రభుత్వం సెమెన్ నీ పూర్తి ఉచితంగా ఇస్తుంటే, డాక్టర్లు మాత్రం డబ్బులకు అమ్ముకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రైతులకు నాణ్యమైన గిత్తల సెమెన్ ఇవ్వకపోవడంతో ఎన్నిసార్లు సెమెన్ పశువులకు వేసిన గర్భం దాల్చకపోవడంతో, ఎక్కువ శాతం పశువులను వదశాలకు వెళుతున్నాయని వారు అన్నారు. ప్రభుత్వం ద్వారా చేపట్టిన పథకంలో భాగంగా పశువుల పంపిణీ జరుగుతుందని దీనిపై అధికారులు స్పందించాలని వారు కోరారు. పశువులు సరైన వైద్య పరీక్షలు లేకుండా, అనారోగ్యంగా ఉన్నవే పంపిణీ చేస్తున్నారని రైతులు ఆరోపించారు.
ఇప్పటికే చాలామంది రైతుల, పశువులు మృతిచెందాయని అధికారులు గుర్తించకపోవడంతో, రైతులకు నష్టం జరుగుతుందని వారు అన్నారు. మేము అనేకసార్లు ఆధారాలతో అలాగే ఆర్టిఐ ద్వారా మా దగ్గర ఉన్న సమాచారంతో అధికారులు దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేదని, ఈ వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయని వాటిని అధికారులు గుర్తించినప్పటికీ చర్యలు తీసుకుపోవడంలో ఆంతర్యం ఏమిటని వారు ఉన్నారు. మేము ముఖ్యంగా కోరుకునేది ఒక్కటే 1, పశువులకు వైద్య పరీక్షలు చేసి ఆరోగ్యంగా ఉండే సెమెన్ మాత్రమే పంపిణీ చేయాలి.2, పశువులు చనిపోతే రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి.3, పంపిణీ వ్యవస్థలో పారదర్శకత ఉండాలి.4, బాధ్యత వహించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలా జరిగినప్పుడే పశువుల రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉంటారని వారు తెలియజేశారు.