

- మండల కన్వీనర్ రామిశెట్టి నాని
శంఖవరం, ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఎసి సభ్యులు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో తిరిగివస్తారని మండల కన్వీనర్ రామిశెట్టి నాని తెలిపారు. మండలంలో రౌతు పాలెం గ్రామంలో గురువారం సాయినాధుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో సాయినాధునికి భజన కీర్తనలతో సాయినాధునికి పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న మండల కన్వీనర్ రామిశెట్టి నాని మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకొని ప్రజలకు అందుబాటులోకి వస్తారని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు కూడా తన తండ్రి ముద్రగడ పద్మనాభం కు దగ్గరుండి సేవలందిస్తూ వైద్యులతో ముద్రగడ కుమారులు ముద్రగడ వీర్రాఘవారావు (బాలు ) ఎప్పటికప్పుడు పద్మనాభంకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకుంటూ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు ముద్రగడ యోగక్షేమాలు తెలియజేస్తున్నారని ముద్రగడ ఆరోగ్యం పట్ల ఎవరు ఆందోళన చెందవద్దని ముద్రగడ కుమారులు బాలు, గిరిబాబు తెలియజేశారు అన్నారు. నియోజకవర్గానికి కొన్ని దశాబ్దాల కాలం నుండి ముద్రగడ పద్మనాభం చేసిన సేవలను కొనియాడారు. ప్రజల అభిమానాలతో ముద్రగడ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ గోళ్ల నాగేశ్వరరావు, గొల్లపల్లి దొరబాబు, నేదుళ్ళ శ్రీను , ముద్రగడ వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు.