

సర్పంచ్ లకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు :- గూడూరు ఎంపీపీ గురవయ్య
గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా ముగిసింది..కేవలం ఒక్క గంట లోనే సమావేశాన్ని తూతూ మంత్రంగా ముంగించేశారు..అప్పటికే సమయ పాలన పాటించకుండా ఒక్కొక్కరిగా కార్యాలయానికి చేరుకున్న కొందరు అధికారులు హడావుడిగా నాలుగు ముక్కలు మాట్లాడి మమ అనిపించేశారు…ఈ క్రమంలో సర్పంచ్ లకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఎంపీపీ గురవయ్య ఆరోపించారు.. ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచ్ లకు అధికారులు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అభివృద్ధి పనుల కొరకు కనీసం ఫోన్ చేస్తే మాట్లాడలేని స్థితిలో ఉన్నారని మండిపడ్డారు..ఈ సందర్భంగా పలు శాఖల అధికారుల తీరుపై ఎంపీపీ గురవయ్య అసహనం వ్యక్తం చేశారు… ఇదిలా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీపీ కావడంతోనే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అధికారులు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని పలువురు చర్చించుకోవడం గమనార్హం.
