

మన న్యూస్ పాచిపెంట, జూలై 22:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో రైతులు విచక్షణ రహితంగా రసాయన ఎరువులు వాడడం వలన భూమిలో ఉన్న వానపాములు ఉపయోగపడే అనేక సూక్ష్మజీవులు నశిస్తున్నాయని కాబట్టి అవసరమైనంత మేర మాత్రమే రసాయన ఎరువులు వాడుకోవాలని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు.మంగళవారం నాడు చెరుకుపల్లి లో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో వరి పంట లో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. దమ్ముకు పంట దమ్ముకు వారం రోజులు వ్యవధి ఉంచాలని ఒక చదరపు మీటరు కనీసం 33 కుదుర్లు ఉండేటట్లుగా నాటుకోవాలని బురదపదునులో తేలిక పాటు నాట్లు మాత్రమే వేసుకోవాలని సూచించారు.కాంప్లెక్స్ ఎరువులను దమ్ములో మాత్రమే వేసుకోవాలి పొటాష్ ఎరువులు రెండు భాగాలుగా చేసుకుని దమ్ము లో ఒక భాగం చిరు పొట్ట దశలో రెండవ భాగం వేసుకోవాలని సూచించారు.విచక్షణ రహితంగా పురుగు మందులు వాడటం వలన నష్టపరచవు అనుకున్న పురుగులు ఉధృతి పెరిగి నష్టపరిచే స్థాయిని దాటుతున్నాయని ఉదాహరణకు గత సంవత్సరం ఆర్ జి ఎల్ వరి రకంలో వచ్చిన రెల్లరాల్చు పురుగు గతంలో ఎన్నడూ నష్ట పరిమితి స్థాయిని దాటలేదని తెలిపారు. ముందుగా వేప నూనె వేప కషాయం వంటి వాటిని వినియోగించుకోవాలని సుడోమానాస్ ట్రైకోడెర్మా వంటి వాటితో తెగుళ్ళను నివారించుకోవాలని సూచించారు.అనంతరం జామ తోటలో క్షేత్ర ప్రదర్శన చేసి జామ పండించే విధానాన్ని రైతులు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ నాగమణి వి ఏ ఏ లావణ్య ప్రకృతి సేద్య ఎల్ 2 విజయ్ పాల్గొన్నారు.
