

మన న్యూస్,తిరుపతి, జులై 22 :
తిరుపతి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన అధ్యక్షులుగా ఎస్ జయ కుమార్ 102 ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్రంలోని తిరుపతి నగరంలో మొట్టమొదటిసారిగా బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 530 ఓట్ల గాను 37 6 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ మంగళవారం యూత్ హాస్టల్ లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు హోరాహోరీగా జరిగింది. పోలింగ్ అనంతరం సాయంత్రం నాలుగు గంటల ఫలితాలు వెలువడి అయ్యేంతవరకు కౌంటింగ్ జరిగింది. ఎన్నికల్లో అధ్యక్షులుగా జయ కుమార్ కు 231 పోలయ్యాయి. ప్రత్యర్థి అభ్యర్థి ఆవుల రాఘవకు 129 ఓట్లు వచ్చాయి. 102 ఓట్ల భారీ మెజార్టీతో జయ కుమార్ విజయం సాధించారు. కార్యదర్శిగా ఆవుల పాటి బుజ్జిబాబు వర్గానికి చెందిన కార్యదర్శి అభ్యర్థి గోవింద స్వామికి 127 ఓట్లు పోలు కాగా, తిరుపతి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం మాజీ అధ్యక్షులు సిబ్యాల సుధాకర్ వర్గానికి చెందిన గల్లా దాము కు 237 ఓట్ల సాధించి 110 ఓట్ల మెజార్టీ తో విజయకేతనం ఎగురవేశారు. కోశాధికారిగా ఉప్పలపాటి శివ 234 ఓట్లు రాగా, ప్రత్యర్థి బుజ్జి బాబు వర్గానికి చెందిన శ్రీనివాస్ కు 114 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 120 ఓట్ల మెజార్టీతో యు శివ మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికలకు ఎన్నికల అధికారులుగా జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు సురేంద్ర, సీనియర్ జర్నలిస్టు ద్వారక, తిరుపతి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం గౌరవాధ్యక్షులు రామనారాయణ లు వ్యవహరించారు. మొట్టమొదటిసారిగా పోలింగ్ పద్ధతిలో….
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం కార్యవర్గానికి బ్యాలెట్ పేపర్ పద్ధతిలో పోలింగ్ హోరా హోరీగా సాగింది. ఎట్టకేలకు సిబ్యాల సుధాకర్, అవిలాల ముని కార్యవర్గం విజయం సాధించింది. దీంతో తిరుపతిలోనే నాయి బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు నూతన కార్యవర్గానికి అభినందనలతో ముంచేత్తారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యూనివర్సిటీ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ ఎన్నికల నిర్వహణలో ఆవులపాటి బుజ్జిబాబు తో క్షవర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంగులప్ప, ఇనుగొండ లక్ష్మణరావు, కమల్ తదితరులు పాల్గొన్నారు.

