

మన న్యూస్, నారాయణపేట జిల్లా :- నారాయణపేట జిల్లా అప్పి రెడ్డి పల్లి గ్రామానికి చెందిన మొగిలిమ్మ, మంగళవారం తెల్లవారుజామున పురిటి నొప్పులు రావడంతో 108 కి కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. హుటా హుటిన నారాయణపేట జిల్లా కు తరలిస్తుండగా మార్గమధ్యలో ఆడబిడ్డకు జన్మనిచ్చిందని, ఈఎంటి, శిరీష పైలట్ మాణికప్ప తెలిపారు. సకాలంలో తగిన ప్రధమ చికిత్స అందించడంలో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వైద్యులు బంధువులు వెల్లడించారు.