అంగన్వాడీలకు ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి…

  • అంగన్వాడీ యూనియన్ నాయకురాలు జి బుల్లెమ్మ డిమాండ్..

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:-
గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు, అంగన్వాడీలకు ఎఫ్ ఆర్ ఎస్ రద్దు చేయాలని కోరుతూ మండల కేంద్రమైన శంఖవరం స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ యూనియన్ నాయకురాలు జి బుల్లెమ్మ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఐసిడిఎస్ లక్ష్యం పేద గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు ఆహారం, ఆరోగ్యం, విద్య అందించాలి. కానీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పోషణ ట్రాకర్ యాప్, బాల సంజీవిని యాప్ తీసుకొచ్చి లబ్దిదారులను అంగన్వాడి సెంటర్లకు దూరం చేసే విధానాలు అమలు చేస్తున్నారు. లబ్దిదారులకు అందించే ఆహారము ఓటీపీ ద్వారా ఈ కేవైసీ చేసి ఫోటో క్యాప్చర్ చేస్తేనే సరుకులు ఇవ్వాలని పెట్టిన నిబంధనను తొలగించాలని రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు. ధర్నాలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జి బుల్లెమ్మ మాట్లాడుతూ, గతంలో వలె లబ్దిదారులు కు సంతకం పెట్టించుకొని సరుకులుఇవ్వాలని, ఎఫ్ ఆర్ ఎస్ ను రద్దు చేయాలని కోరుతూ జూలై 21న రాష్ట్రవ్యాప్తంగా అన్ని సిడిపిఓ ఆఫీసుల వద్ద జరిగే ధర్నాల్లో అంగన్వాడీలు, లబ్దిదారులుధర్నా నిర్వహించడం జరిగిందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భిణీ బాలింతలు పిల్లలకు అందిస్తున్న సరుకులు పోషణ ట్రాకర్,బాల సంజీవిని యాప్ ద్వారానే ఇవ్వాలని, బియ్యం, పప్పు, ఆయిల్, గుడ్లు, బాల సంజీవిని కిట్లు, బాలామృతం తదితర సరుకులు అన్నియు ఒక్కసారిగా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసరుకులు ఇచ్చేటప్పుడు అంగన్వాడి వర్కర్ ఫోటోతో పాటు, లబ్దిదారులకు ఫోటోలు తీసి మాత్రమే ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, లబ్దిదారులు సరుకులు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఫోన్లు పనిచేయక పోవడం, నెట్ సిగ్నల్ లేకపోవడం, సర్వర్లు పనిచేయకపోవడంతో వారు విసిగిపోతున్నారని అన్నారు. రెండు మూడు గంటలకు కూర్చొని సరుకులున్న ఇవ్వలేని పరిస్థితిలో లబ్దిదారులు, అంగన్వాడీలు మానసిక వేదనకు గురవుతున్నారని,
అంగన్వాడీ సెంటర్ నిర్వహణకు 2021లో ఫోన్ ఇచ్చారు. 90% ఫోన్లు చెడిపోయాయని, యాపులకు నిర్వహణకు కావలసిన నెట్ స్పీడ్ ఇవ్వలేదన్నారు. ఎటువంటి ట్రైనింగు లేదు. గ్రామాల్లో మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో అసలు సిగ్నలే ఉండటంలేదు. కానీ లబ్దిదారుల రిజిస్ట్రేషన్, సరుకుల పంపిణీ, మొత్తం ఆన్లైన్ ద్వారానే జరగాలని అధికారులు పెట్టే ఒత్తిడితో ప్రీస్కూల్ దెబ్బతింటుందన్నారు. ప్రభుత్వం స్కూల్ బలోపేతం చేస్తాం అని మాటల చెబుతూ ఆచరణలో ప్రభుత్వమే ఆటంకాలు సృష్టింస్తుంది. ఆన్లైన్ లో రిజిస్టర్ అయితేనే వచ్చే నెలలో సరుకులు వస్తాయి అని బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. దీనివల్ల రాబోయే కాలంలో అంగన్వాడీ సెంటర్ కి వచ్చే లబ్దిదారులు, పిల్లలు తగ్గిపోయే ప్రమాదం ఉందని, ఇది ఐసిడిఎస్ లక్ష్యానికే విరుద్ధమైనదని, కావున లబ్దిదారులకు గతంలో వలె సంతకం పెట్టించుకుని సరుకులు ఇవ్వడానికి అనుమతి ఇవ్వాలని, అంగన్వాడీలకు, గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు ఎఫ్ ఆర్ ఎస్ రద్దు చేయాలని ప్రీస్కూల్ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని ప్రధాన డిమాండ్లను తెలియజేస్తూ, స్థానిక సిడిపిఓకి వినపత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో శంఖవరం ప్రాజెక్టు వర్కర్స్ హెల్పర్స్ లబ్ధిదారులు, బి. రత్నకుమారి, ఆశాజ్యోతి, సత్యవేణి, తదితర అంగన్వాడీ కార్యకర్తలు, సహాయ కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///