

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం లింగంపర్తి మెయిన్ సెంటర్లో అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు చిత్రం ఘన విజయం సాధించాలని నియోజకవర్గ జనసైనికులు వరుపుల తమ్మయ్యబాబు పూజలు నిర్వహించారు. నియోజకవర్గం లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన జనసైనికులతో కలసి లింగంపర్తి లో భారీగా ఊరేగింపు నిర్వహించి. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరుపుల తమ్మయ్యబాబు మాట్లాడుతూ సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనకంటూ మార్క్ సంపాదించుకొని తనకు వచ్చిన ప్రతి పైసలు పేద ప్రజల అభ్యున్నతికి ఖర్చు చేయడంలో పవన్ కళ్యాణ్ ని మించిన నాయకుడు లేడు అన్నారు. ఆయన రాజకీయాలలోకి రాకముందు నుండి సినిమాలలో వచ్చే ప్రతి పైసా ప్రజలకు సాయం చేయడంతో పాటు డిప్యూటీ సీఎం ఆయన మరుక్షణ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు అభ్యున్నతి వైపు అడుగులు వేస్తున్నారని అన్నారు. సినిమా విడుదలకు సంబంధించి పవన్ ఫ్యాన్స్ తెలుగు సినీ ప్రేక్షకులు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు.