నిరాహార దీక్ష చేపట్టకుండానే మేకల కృష్ణ అరెస్ట్…

  • దీక్షను ముందుకు కొనసాగించిన మేకల కృష్ణ కుటుంబ సభ్యులు…
  • ఇది గ్రామ సమస్య గ్రామంలో గల పెద్దలు మద్దతు ఇవ్వండని కోరిన ఎంపీపీ…
  • న్యాయ పోరాటానికి అధికారులు సహకరించడం లేదు…
  • ఉన్నత న్యాయస్థానం నుండి ఉత్తర్వులతోనే దీక్ష కొనసాగిస్తా…
  • మరల కలుస్తా అంటూ..దీక్షను విరమించిన మేకల కృష్ణ…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:-ప్రజా శ్రేయస్సు కొరకు అక్రమ క్వారీ లారీల రవాణాపై మేకల కృష్ణ చేపట్టనున్న నిరాహార దీక్షకు పోలీసులు ఉక్కు పాదం మోపారు. ఈ దీక్ష ద్వారా శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని తెలిపారు. అక్రమ క్వారీ లారీల రవాణాపై శంఖవరం గ్రామ సామాజిక ఉద్యమ నేత మేకల కృష్ణ జులై 21 సోమవారం ఉదయం 9 గంటలకు నిరాహార దీక్ష చేపడతానని మీడియా పూర్వకంగా ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో సోమవారం మరికొద్ది సేపట్లో నిరాహార దీక్ష చేపడుతున్న తరుణంలో మేకల కృష్ణ ఇంటి నుండి అన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అనంతరం దీక్ష స్థలానికి వారి కుమారులు మేకల కృష్ణ సతీమణి చేరుకొని దీక్షను కొనసాగించారు. అక్రమ లారీ లారీ రవాణాపై గ్రామంలో వివిధ వర్గాల పెద్దలు పాల్గొని మద్దతు తెలిపారు. శంఖవరం గ్రామ పెద్దలు, మండల ఎంపీపీ పర్వత రాజబాబు దీక్ష స్థలానికి చేరుకుని నయం కోసం పోరాడుతున్న మేకల కృష్ణ కుటుంబానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సమస్య గ్రామ సమస్య కాబట్టి గ్రామంలో గల పెద్దలు, ప్రజలు తరలివచ్చి న్యాయ పోరాటానికి భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం అన్నవరం పోలీస్ స్టేషన్ నుంచి మేకల కృష్ణ తరలివచ్చి న్యాయ పోరాటానికి అధికారులు సహకరించడం లేదని, హైకోర్టు నుండి ఉత్తర్వులు తీసుకుని దీక్షను మరల కొనసాగిస్తానని తెలుపుతూ దీక్షను విరమించారు. సహకరించిన దళిత వర్గ పెద్దలు పులి సుధాకర్, గుద్ధటి నాగేశ్వరరావు, ముస్లిం మైనారిటీ వర్గం నుండి వైద్యులు సయ్యద్ హుస్సేన్, ఆచంట వెంకటేశ్వరరావు, బొమ్మిడి చిట్టిబాబు, మరియు బీసీ వర్గాల నాయకులు గ్రామ ప్రజలు పాల్గొని మద్దతు తెలిపారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///