

మన న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ ఎస్ఐ తెలిపారు సంతోష్ అన్నారని శాంతినగర్ చెందిన షేక్ నౌసిన్ అన్నారు. నా భర్త షేక్ తాహెర్ నా పెండ్లి కాకముందే అమెరికాకు చెందిన అమ్మాయి సన్నీస్మిత్ ను 2017 లోనే పెళ్లి చేసుకున్నాడని నా పెళ్లి 2022లో అయిందని అప్పటినుంచి నా భర్త నన్ను కొట్టడం, తిట్టడం అదనపు కట్నం తెమ్మనడం, నీకు పిల్లలు కారని నన్ను ఎంతగానో వేధించేవాడని, ఇటీవల కాలంలోనే మహబూబ్నగర్ కు చెందిన ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్న క్రమంలో తాము అడ్డగించామని, నా తండ్రి ఎండి జాంగిర్ భాష పెళ్లి సమయంలో కట్నం గా 10,00,000. రూపాయలు, జహజ్ కింద 5 లక్షల రూపాయలు, మారుతి బ్రీజా కొరకు 12 లక్షల రూపాయలు, బుల్లెట్ బండి కొరకు 3 లక్షల రూపాయలు ఇచ్చి పెండ్లి చేసి ఇచ్చాడని, పెండ్లి అయినప్పటి నుండి గంజాయి మత్తు తీసుకొని నన్ను వేధించేవాడని గతంలో మా తల్లిదండ్రులకు చెప్పిన కాపురం చేయాలని సర్ది చెప్పేవారని, గతంలో అతని బంధువులు రిటైర్డ్ ఎస్సై రజాక్ తదితరులపై కేసు పెట్టిన శాంతినగర్ ఎస్ఐ పట్టించుకోకుండా నిందితులకు వత్తాసు పలికి, మా తండ్రి అయినా జహంగీర్ ను శాంతినగర్ ఎస్ఐ సంతోష్ మీరు 3 లక్షల రూపాయలు నాకు ఇస్తే నేను కేసును రిజిస్టర్ చేస్తానని లేకపోతే చేయనని తెగేసి చెప్పారని అందుకు స్పందించిన మా తండ్రి నా బిడ్డ పెళ్లి చేసి కృంగిపోయామని నేను మీకు డబ్బులు ఇవ్వలేనని నా కూతురి జీవితం నాశనం అయిందని మాకు సహకరించి అతనిపై కేసు చేయాలని వేడుకున్న కూడా ఎస్సై తమకు సహకరించకుండా నిందితులకు సహకరిస్తూ వచ్చాడని ఈ విషయాన్ని గతంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేయగా సానుకూలంగా స్పందించిన ఎస్పి చెప్పిన కూడా ఎస్ఐ తప్పుడు కేసు నమోదు చేశాడని, ఈ విషయాన్ని కూడా మా తండ్రి, నేను పై అధికారులకు తెలిపామని, ఈనెల 11వ తేదీన నా భర్త గతంలో చేసుకున్న పెళ్లి విషయాన్ని ఆధారాలతో ఫిర్యాదు చేస్తే నేటి వరకు ఎస్సై కేసు చేయలేదని ఈ విషయంపై డి జి పి, ఐజి, ప్రజా దర్బార్ కు ఫిర్యాదు చేస్తే స్పందించిన వారు జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు కలవండని చెప్పగా ఎస్పీ శ్రీనివాసరావును, గద్వాల డిఎస్పి సత్యనారాయణ ను కూడా కలిశామని కేసుకు సహకరిస్తామని వారు చెప్పినట్టు నేటి వరకు శాంతినగర్ ఎస్ఐ తన భర్త పై, ఇతరుల పై పెట్టిన కేసును నమోదు చేయలేదని పై అధికారులు ఆదేశించిన కూడా వారి ఆదేశాలను కూడా లెక్క చేయలేదని అటువంటి ఎస్ఐపై చర్య తీసుకొని, కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని మీడియా ముందు షేక్ నౌసిన్ తండ్రి షేక్ జాంగిర్ కోరారు.