

మన న్యూస్,నిజాంసాగర్( జుక్కల్ )మండలంలోని వడ్డేపల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అన్నారు.నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆయన రైతులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. నాగమడుగు ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతుల పక్షాన నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి నిర్వహించిన రైతుల సమావేశంలో రైతుల తరఫున మాట్లాడడం జరిగిందన్నారు. రైతులకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ కు కోరడం జరిగిందని తెలిపారు.రైతుల తరఫున వారి యొక్క సమస్యలు కొన్ని సూచనలను సబ్ కలెక్టర్ కు విన్నవించడం జరిగింది అన్నారు.ఈ ప్రాజెక్టు లో వడ్డేపల్లి గ్రామంలతో పాటు ఐదు గ్రామాలకు ప్రతిపాదిం చిన పైపులైన్ సంబంధించి 2593 ఎకరాలకు చెరువులను నింపే ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రారంభించాలని దానికి సంబంధించిన పనులను తొందరగా ప్రారంభించాలని కోరుతూ ప్రాజెక్టు మొదటి విడతలో 14,000 ఎకరాలకు నీరందించే పైప్ లైన్,ప్రాజెక్ట్ నుండి దాదాపు 9 కిలో మీటర్ పరిధిలో ఉన్న రైతులందరికీ ఒకేసారి భూ సేకరణ చేయాలని,భూమి కోల్పోయిన రైతులకు గతంలో ఈ ప్రాజెక్టులో భూమి కోల్పోయిన రైతులకు ఎకరానికి పరిహారం 17 లక్షలు ఇచ్చారని, ప్రస్తుతం పెరిగిన మార్కెట్ ధరలకు అనుగుణంగా ఇప్పుడున్న పరిస్థితులలో ఆ యొక్క పరిహారం సరిపోదని ఎకరానికి 30 లక్షల పరిహారం చెల్లించాలని రైతులందరికీ న్యాయం చేసే విధంగా చూడాలని సబ్ కలెక్టర్ కు కోరడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో రైతులు, హనుమంత్ రెడ్డి,మచ్చా రవీందర్,సాయిలు,ప్రజా పండరి,ప్రదీప్,తదితరులు పాల్గొన్నారు.