మన న్యూస్,తిరుపతి :– ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో వచ్చే నెల 15 నుండి రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణమని రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు. శనివారం 29వ డివిజన్ పరిధిలోని కుమ్మరి తోపులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి సుగుణమ్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్లస్టర్ ఇంచార్జ్ టిడిపి రాష్ట్ర కార్యదర్శి బుల్లెట్ రమణ ఆధ్వర్యంలో స్థానికం మహిళలు సుగుణమ్మకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని చెప్పారు. సూపర్ సిక్స్ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతాయని తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా అభివృద్ధి చెందుతుందని, తిరుపతి నియోజకవర్గ అభివృద్ధి పథంలో ముందుకెళుతుందన్నారు. అనంతరం ఇంటింటికి ఏడాది పొలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర్ అధ్యక్షులు వట్టికుంట చినబాబు, రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ కరాటే చంద్ర,టౌన్ బ్యాంకు మాజీ డైరెక్టర్లు ఆర్ మునిరామయ్య, రామ్మూర్తి రాయల్, టిడిపి బీసీ సెల్ నగర అధ్యక్షులు విశ్వనాథం, వార్డు అధ్యక్షురాలు కల్పన జయంతి జుబేదా రాజా రమేష్ నరేష్ బూత్ కన్వీనర్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *