గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు లో మున్సిపల్ కార్మికులు రాష్ట్ర జిల్లా కమిటీల పిలుపుమేరకు గురువారం రోజు మున్సిపల్ పారిశుద్ధ్య మరియు ఇంజనీరింగ్ కార్మికులకు అందరికీ సంక్షేమ పథకాలు,తల్లికి వందనం వర్తింప చేయాలని, కోరుతూ ఏ.పీ. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం, ఇంజనీరింగ్ కార్మికులకు 36వ జి.ఓ.ని వర్తింపజేయాలని, చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు గ్రాడ్యూటీ చెల్లింపు, గత 17 రోజులు సమ్మె కాలపు ఒప్పందాలైన రిటైర్మెంట్ బెనిఫిట్స్,ఎక్స్ గ్రేషియా, దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం పెంపు, మొదలైన డిమాండ్లు పరిష్కార విషయంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను తాచారం చేస్తూ ఉందని, వెంటనే హామీలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం గూడూరు పట్టణ కార్యదర్శి దార కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎన్.వెంకట రమణయ్య, మున్సిపల్ కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు జోగి. శివకుమార్, సి.ఐ.టి.యు నాయకులు బి.వి రమణయ్య, పామoజి మణి, పుట్టా శంకరయ్య,అడపాల ప్రసాద్, చంద్రమోహన్, జి.శ్రీనివాసులు, పెంచలమ్మ,జి.కృష్ణమ్మ, వెంకటయ్య, వాసుదేవ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *