అంగన్‌వాడీ కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్లు పంపిణీ చేశారంటూ సోషల్ మీడియ లో చక్కర్లు కొట్టిన ఘటన

మనన్యూస్ ప్రతినిధి జూన్ 28 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా గట్టు మండలం తారపురం గ్రామంలో చోటుచేసుకుంది. . తారపురం అంగన్‌వాడీ కేంద్రంలో ఈ నెల 14 న బాలింతలకు కోడి గుడ్లను పంపిణీ చేశారు. వాటిని శుక్రవారం ఇంటి వద్ద ఉడకబెడుతుండగా దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి ఉడకబెట్టని కొన్ని గుడ్లను పగులగొట్టడంతో అవి పాడై పోయి కుళ్ళిన వాసన వచ్చాయి. పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీ లో నాసిరకం పాడైపోయిన గుడ్లు పంపిణీ చేస్తున్న అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *