ప్రశాంతతను పెంపొందించడానికే యోగాసనాలు…

  • తెలుగుదేశం పార్టీసీనియర్ నాయకులు పర్వత సురేష్…

శంఖవరం మన న్యూస్ (అపురూప్):- ప్రశాంతతను పెంపొందించడానికి యోగా ఎంతగానో సహాయపడుతుందని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి పర్వత సురేష్ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం సచివాలయం-1 ఎదుట ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో పర్వత సురేష్ ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగా కార్యక్రమాన్ని నిర్వహించి యోగాసనాలు వేశారు. యోగా కార్యక్రమంలో శంఖవరం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి లక్ష్మిరెడ్డి, శంఖవరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి శెట్టుబత్తుల రాజీవ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత పర్వత సురేష్ మాట్లాడుతూ, ప్రశాంతతను పెంపొందించడానికి యోగా ఎంతగానో సహాయపడుతుందని యోగ మన శరీరం ఆత్మ రెండిటిపై పనిచేస్తుందని తెలిపారు. అలాంటి యోగాను మన జీవితంలో ఒక భాగంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రతిరోజు కాసేపు యోగ చేద్దామని సూచించారు. అనంతరం శంకవరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి ఎస్ఎస్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, యోగ అనేది వ్యాయామం మాత్రమే కాదని శరీరం మనసు ఆత్మను ఏకం చేసే అద్భుతమైన సాధనమని అన్నారు. ప్రపంచానికి భారతదేశ అందించిన గొప్ప వరం యోగా అని తెలిపారు. యోగాసనాలు వేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని, అనేక వ్యాధులకు నివారణ అరికట్టొచ్చని అన్నారు. యోగాసరాల ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుందని సూచించారు. అనంతరం యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సుమారు 100 మందికి టీడీపి సీనియర్ నేత పర్వత సురేష్ అల్పాహారాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ చింతంనిడి కుమార్, టీడీపీ నేతలు బుర్ర వాసు, పంచాయితీ కార్యదర్శి అప్పలరాజు, వీఆర్వో సీతారాం, బుర్ర వరప్రసాద్, రౌతు శ్రీను, సి. శివ, సచివాలయ సిబ్బంది, వెలుగు సిబ్బంది, ప్రభుత్వాసుపత్రి సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు