శ్రీ శ్రీ పెద్ద పార్వతమ్మ తల్లి జాతర మరియు శ్రీ సీతారాముల స్వామి వారి గ్రామ తిరునాళ్ళ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి .మన న్యూస్, కావలి:పెద్దపట్టపు పాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని రూపురేఖలను పూర్తిగా మార్చేశా.*జై కావ్య,జై జై కావ్య అనే శ్లోకంతో మారు మోగిన పెద్దపట్టపు పాలెం గ్రామం.కావలి రూరల్ మండలం పెద్దపట్టపు పాలెం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద పార్వతమ్మ తల్లి జాతర మరియు శ్రీ సీతారాముల స్వామి వారి గ్రామ తిరునాళ్ళ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. పార్వతమ్మ మరియు రాములవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వామి వారి, అమ్మవారి ఆశీస్సులు కావలి నియోజకవర్గ ప్రజలకు ఉండాలని కోరుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. పెద్దపట్టపు పాలెం గ్రామాన్ని దత్తత తీసుకొని రెండు సంవత్సరాల్లో గ్రామంలో అన్నీ వీధుల్లో సీసీ రోడ్లు వేయిస్తానని తెలిపారు. కరెంట్ సమస్య తలెత్తకుండా నూతన విద్యుత్ స్థంబాలు, నూతన విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని,నియోజకవర్గం లో ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తానని, కావలి ని కాపు కాస్తానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *