మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు….మహానటుడు నందమూరి తారకరామారావు సినీ వజ్రోత్సవ వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరామ్ వర్మ, ప్రత్తిపాడు అధ్యక్షుడు అడపా జగదీష్,కాకినాడ అధ్యక్షుడు బత్తుల సూర్యప్రసాద్,ఉపాధ్యక్షుడు కర్రి వీరబాబు,ఎన్టీఆర్ అభిమానులు ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగువారి గుండె చప్పుడు దివంగత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ నటించిన తొలిచిత్రం మనదేశం విడుదలై నేటికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు రాష్ట్ర మంతటా ఘనంగా జరిగాయని తెలిపారు.ఈసందర్భంగా అడపా జగదీష్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు సుబ్బు, సాయిరామ్ వర్మ,జగదీష్ లను భారీ గజమాలతో సత్కరించారు.ఎన్టీఆర్ వజ్రోత్సవాల సందర్భంగా చంద్రబాబు,లోకేష్,టీడీ జనార్థన్,ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆశీస్సులతో అన్నా ఎన్టీఆర్ జనార్థన్ కేరేజ్ 922వ రోజు అయ్యప్ప స్వాములకి, పేదలకు భారీ ఎత్తున అన్నదానం చేశారు.సాయిరామ్ వర్మ, జి.శ్రీనివాసరావు,గూడెం అప్పారావు(బుజ్జి) సమకూర్చిన 5 కేజీల బియ్యం బస్తాలు పేదలకు అందించారు.ఈ కార్యక్రమంలో బొక్కా నూకరాజు,మండపాక శ్రీనివాసరావు,ఎన్టీఆర్ అభిమానులు,ఫౌండేషన్ సభ్యులు,తెదేపా శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *