మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్:
ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన నిస్సి గోల్డ్ అనే 15 సంవత్సరాలువయస్సు గల అమ్మాయి ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు కనిపించకుండా పోయినట్లు,గుర్తించిన ఆమె తల్లిదండ్రులు,బంధువులు చుట్టూ ప్రక్కల వెతికినా ఆచూకి దొరకకపోవడంతో వారి తల్లిదండ్రులు ఈ నెల 13వ తేదీ రాత్రి 10 గంటలకు ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.బాధితుల ఫిర్యాదు మేరకు బాలిక మిస్సింగ్ అయినట్లు ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి వెంటనే ప్రత్తిపాడు సిఐ సూర్య అప్పారావు ఆధ్వర్యంలో ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మీకాంతం వారి సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తనిఖీ చేపట్టారు.మిస్సింగ్ అయిన అమ్మాయిని అత్యంత చాకచక్యంగా కేసు నమోదు అయిన 12 గంటల వ్యవధిలో అమ్మాయి ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకి అప్పగించారు.మిస్సింగ్ అమ్మాయి కేసును అతి తక్కువ సమయంలో ట్రేస్ చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించడంలో కృషి చేసిన ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మి కాంతంను మరియు వారి సిబ్బందిని డిఎస్పీ,సిఐలతో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *