మన న్యూస్ ,నెల్లూరు/లక్నో : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో పర్యటనకు వెళ్లిన రాష్ట్ర మంత్రి మంత్రి పొంగూరు నారాయణ బుధవారం ఉదయం బృందానికి ఘన స్వాగతం పలికిన లక్నో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సుష్మా ఖరాక్వాల్ , కమిషనర్ గౌరవ్ కుమార్. మంత్రినారాయణ తో పాటు లక్నో పర్యటన కు వెళ్లి స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు, మంగళగిరి – తాడేపల్లి కార్పొరేషన్ కమిషనర్ అలీమ్ భాష .లక్నో లో ఘన వ్యర్థాల నిర్వహణ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి బృందానికి వివరించిన కార్పొరేషన్ అధికారులు.లక్నో లో వెస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్, ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణ ను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన మంత్రి నారాయణ బృందం.ఆంధ్రప్రదేశ్ ను డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ శాఖ ప్రణాళికలు.అందులో భాగంగానే ఇప్పటికే ఉన్న రెండు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు….త్వరలో మరికొన్ని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్న మున్సిపల్ శాఖ.ఇతర రాష్ట్రాలలో వ్యర్థాల నిర్వహణను ఏవిధంగా చేస్తున్నారో అధ్యయనం చేస్తున్న మంత్రి నారాయణ బృందం. నిన్న పూణే సమీపంలో ఉన్న పింప్రి చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పరిశీలన. నేడు లక్నో కార్పొరేషన్ పరిధిలో ఉన్న వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పరిశీలిస్తున్న మంత్రి బృందం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *