మన న్యూస్ ,నెల్లూరు :గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం పై నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , తీవ్ర విచారం వ్యక్తం చేశారు. BJ మెడికల్ కాలేజీ మెస్ పై విమానం కూలడం తో విమానం లోని ప్రయాణికుల తో పాటు మెస్ లోని మెడికోలు మరణించడం తీవ్ర దిగ్బ్రాంతి కి గురిచేసిందన్నారు. 242 మంది తమ ప్రాణాలు కోల్పోవడం మనసుని తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు. ఘటన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కుటుంబాలకు అండగా ఉంటాయని వెల్లడించారు, అదే విధంగా క్షతగాత్రులకి వెంటనే సరైన వైద్య సదుపాయం అందాలని కోరారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆ బాధిత కుటుంబాలకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *