మన న్యూస్ ,వెంకటాచలం:సర్వేపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్న సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శృతిరెడ్డి ఇంటింటి పర్యటన. రెండో రోజైన సోమవారం వెంకటాచలం మండలం కురిచెర్లపాడులో పర్యటన సాగించిన సోమిరెడ్డి దంపతులు.ఆత్మీయ స్వాగతం పలికిన కురిచెర్లపాడు వాసులు.గ్రామస్తులతో సమావేశం నిర్వహించి సమస్యలపై ఆరా తీసిన సోమిరెడ్డి.ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామస్తులకు వివరణ.వీవర్స్ కాలనీలో చేనేత కార్మికుల సమస్యలపై ఆరా.ప్రతి సమస్యను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ.మొదట గ్రామస్తులతో కలసి కోలాటం ఆడిన సోమిరెడ్డి కుటుంబ సభ్యులు.యువ నాయకుడు, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ అన్న స్ఫూర్తితో ఇంటింటికీ చేపట్టి ప్రజల బాగోగులు తెలుసుకుంటున్నామని వెల్లడించిన రాజగోపాల్ రెడ్డి, శృతిరెడ్డి.ప్రజల దగ్గరకే వెళ్లి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామని, నిరంతరం ప్రజల్లోనే ఉంటామని వెల్లడి.సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలను కలుసుకుంటామని ప్రకటన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *